Manipur violence : మ‌ణిపూర్ లో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం..

Manipur violence : మ‌ణిపూర్ లో మ‌ళ్లీ కాల్పుల క‌ల‌క‌లం..
ఇద్ద‌రు మృతి, ప‌లువురికి గాయాలు

మణిపుర్‌ ఇంకా రగులుతూనే ఉంది. ఏదో ఒక మూల అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. నాలుగు నెలల క్రితం రావణ కాష్టంలా మండిన ఈశాన్య రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని భావించే లోగానే మరోసారి అల్లర్లు చెలరేగాయి. తాజాగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, మరొకరు గాయపడ్డారు. బిష్ణుపూర్‌ జిల్లాలోని నరైన్‌సెన్‌లో రెండు మిలిటెంట్‌ గ్రూపులు భారీగా పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. గ్రామ వలంటీర్‌గా పనిచేస్తున్న ఒకరు బాంబు పేలుడులో మరణించగా, మరో వ్యక్తి భుజంపై బుల్లెట్‌ గాయమైంది.

మరోవైపు పోలీసులు జరిపిన సోదాలలో వేర్వేరు గ్రూపులకు చెందిన నలుగురిని అరెస్ట్‌ చేసి వారి నుంచి ఆయధాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్‌ లోయలోని ఐదు జిల్లాలలో భద్రతా బలగాల తనిఖీలు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.

తీవ్ర అల్ల‌ర్ల‌తో అట్టుడికిన మ‌ణిపూర్ లో కొన్ని రోజులుగా ప‌రిస్థితులు మెరుగుప‌డుతున్నాయి. అయితే, ఇలాంటి త‌రుణంలో మ‌రోసారి రాష్ట్రంలో కాల్పులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కుకీ ప్రాబల్యం ఉన్న చురాచంద్ పూర్, మెయిటీ ప్రాబల్యం ఉన్న బిష్ణుపూర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మళ్లీ భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. నరన్సేనను ఆనుకుని ఉన్న గ్రామాల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు. ఏడుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో మోహరించిన జిల్లా పోలీసులు, అస్సాం రైఫిల్స్, ఆర్మీ, కేంద్ర బలగాలు స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.

ఖోయిరెంతక్ పరిసర గ్రామాల్లో జరిగిన కాల్పుల్లో గ్రామ వాలంటీర్ మృతి చెందినట్లు ఆదివాసీ ట్రైబల్ లీడర్స్ ఫోరం పేర్కొంది. అతడిని జంగ్మిన్లున్ గాంగ్టే (30)గా గుర్తించారు. ఖోయిరెంటాక్, తినుంగ్గే ప్రాంతాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మరో ఘటనలో ఓ రైతుపై కొండ దిగువన ఉన్న అనుమానిత మిలిటెంట్లు కాల్పులు జరిపారు. నరన్సేనా వార్డు నెంబర్ 8 నివాసి ఇబోటన్ కుమారుడు సలాం జోతిన్ (40) ఈ ఉదయం తినుంగీ మానింగ్ లీకైలోని తన వరి పొలానికి వెళ్తుండగా కాల్పులు జరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story