Odisha : ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య

Odisha : ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
ఒడిస్సా లో మావోయిస్టుల ఘాతుకం

ఒడిస్సా లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. తమ ఉనికిని చాటుకునేందుకు ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. కిడ్నాప్ చేసిన మరో 13 మందిని తమ అదుపులో ఉంచుకున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ఒడిస్సా ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సుక్మా జిల్లా తాడిమెట్ల ఉపసర్పంచ్‌ మాడ్వి గంగను కిడ్నాప్‌ చేసి ప్రజాకోర్టు నిర్వహించేందుకు మరికొందరిని వారితో తీసుకెళ్లారు. పదిరోజులుగా వారు మావోయిస్టుల చెరలోనే ఉంచుకున్నారు. సమాచారం చాలా ఆలస్యంగా బయటకు రావడంతో విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన పోలీస్‌ యంత్రాంగం, ఆదివాసీ సంఘాలు వారిని విడిపించే ప్రయత్నం చేశాయి.దీంతో అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టును నిర్వహించారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ గంగ, టీచర్ సుక్కాను దారుణంగా హత్య చేశారు. మిగిలిన 13 మంది ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్‌ డివిజన్‌ కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story