తాగిన మత్తులో దొంగ చేతికి తాళాలు

తాగిన మత్తులో దొంగ చేతికి తాళాలు
ఫుల్ గా తాగి లిఫ్ట్ అడిగిన వ్యక్తికే కార్ అప్పగింత. తెలివి వచ్చాక పోలీసులను ఆశ్రయించిన బాధితుడు.

మందు బాబులు ఫుల్ గా తాగితే మహారాజుల్లాగ ఫీలవుతారేమో కానీ.. కాస్త తేడా వచ్చినా బికారిగా కూడా మారచ్చు. ఇప్పటివరకు ఇలాంటివన్నీ సినిమాలోని చూసాం. కానీ ఇప్పుడు అలాంటి ఓ రియల్ సంఘటన హర్యాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది.

మందు కొట్టిన తర్వాత మనిషి మారిపోతాడు. అయితే మాటలు, పాటలు, డాన్సులు, గొడవలు ఇలా రకరకాలుగా బిహేవ్ చేసే వాళ్లు అక్కడో ఇక్కడో కనిపిస్తారు. కానీ అమిత్ ప్రకాష్ అనే ఈ వ్యక్తి మాత్రం ఓ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఎలా అంటారా.. ఎంచక్కా తాగిన మైకంలో ఓ దొంగకు తన కారును అప్పగించేసి. ఫుల్లుగా తాగి కారెక్కిన అమిత్ కి మళ్లీ ఇంకో రౌండ్ వెయ్యాలి అనిపించిందో ఏమో ఒక వైన్ షాప్ కెళ్ళి బాటిల్ కొన్నాడు. తన కారు దగ్గరికెళ్లి తాగడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఓ అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చాడు. నేను కూడా కంపెనీ ఇస్తాను అని అడిగాడు. సిగరెట్, మందు లలో స్నేహం బలపడుతుంది అని అనుకున్నాడో లేకపోతే.. తాగినమత్తులో దానగుణం బయటపడిందో గానీ షేరింగ్ ఈజ్ కేరింగ్ అనుకుంటూ అతనికి కూడా మందుపోసాడు.

కాసేపటి తర్వాత వాళ్లిద్దరూ కారులో కొంత దూరం ప్రయాణించారు. కాసేపయ్యాక ఆ అపరిచిత వ్యక్తి అమిత్ ను కారు దిగమన్నాడు. ఉబర్ బుక్ చేసుకొనే అలవాటు ఉందో ఏమో అమిత్ వెంటనే థాంక్స్ చెప్పి కారు దిగిపోయాడు. ఆ అపరిచితుడు జూమ్ జామ్ అంటూ కారేసుకొని వెళ్లిపోయాడు. అప్పటికీ తన కారు దొంగ ఎత్తుకెళ్లాడన్న విషయం గుర్తులేదు అమిత్ కి. ఇంటికి ఆటోలో వచ్చి ఆ రాత్రికి పడుకున్నాడు. తెల్లారాక రాత్రి జరిగిన తతంగం అంతా గుర్తు చేసుకొని.. తాగిన మైకంలో ఓ వ్యక్తికి కారుని అప్పగించినట్లు తెలుసుకున్నాడు. ఇంకేముంది పోలీసులను ఆశ్రయించాడు. కార్ లో రూ.18 వేల నగదు, లాప్‌టాప్, మొబైల్ ఫోన్ కూడా ఉన్నట్లు చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. విచారణ చేపట్టారు. అపరిచితుడు గురించి అమిత్ ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేకపోవడంతో పోలీసులు నిందితుడిని గుర్తించటానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story