Michaung: తమిళనాడును వణికిస్తోన్న మిగ్‍జాం

Michaung: తమిళనాడును వణికిస్తోన్న మిగ్‍జాం
47ఏళ్లలో ఇదే తొలిసారి

మిచౌంగ్ తుఫాన్ బీభత్సం చేస్తోంది. ఈ ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాంబ్రం ప్రాంతంలో నీటిలో చిక్కుకొన్న 15 మందిని NDRF బృందాలు రక్షించాయి. తాంబరం సర్కార్ దవాఖానాలో మోకాళ్ల లోతు నీరు వచ్చి చేరింది. బలమైన గాలులు వీస్తుండగా అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. చెన్నైలో పలు చోట్ల రోడ్లు నదులను తలపిస్తుండగా... మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన 2 వేల 800 బస్సుల్లో 600 మాత్రమే తిరుగుతున్నాయి. వడపళని, కాంచీపురంలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి.... వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేలచేరిలో...... రహదారులపై నిలిపిన కార్లు కొట్టుకపోయాయి. MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబత్తూరు, మైసూరు వెళ్లాల్సిన ఆరు రైళ్లు రద్దు చేశారు. చెన్నైలో 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరగా... చెన్నై లోకల్‌ రైళ్లను నిలిపేశారు.ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసింది. సోమవారం మధ్యాహ్నానికే చెన్నై, శివారు జిల్లాల్లో 35 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దీంతో ఆ ప్రాంతాల్లో వీధులన్నీ వాగులుగా మారాయి. నగరంలో ఎటు చూసినా వరద పోటెత్తింది. ఇళ్లు, పార్కింగ్ ప్రదేశాల్లో ఉన్న వందలాది కార్లు, వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.


తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని దివంగత సీఎం జయలలిత నివాసం, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖులుండే పోయెస్ గార్డెన్ హైవే 7 అడుగుల మేర కుంగింది. మంగళవారం ఉదయంసైతం భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా చెన్నై శివారులోని జాతీయ రహదారి వరద నీటిలో మునగడంతో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయంలోకి వరద నీరు చేరింది. మంగళవారం ఉదయం వరకు విమానాశ్రయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, మంగళవారం ఉదయం వరకు కూడా అక్కడ వర్షపు నీరు నిలిచి ఉంది. భారీ వర్షాల కారణంగా 160 మిమాన సేవలు రద్దయ్యాయి. మరో 33 సర్వీసులు బెంగళూరుకు దారి మళ్లించారు. కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్ట జిల్లాలోనూ తుపాను ప్రభావం ఎక్కువగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story