ఈ మామిడి పండ్లు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..

ఈ మామిడి పండ్లు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
కిలో మామిడి పండ్ల ధర రూ.2.75 లక్షలు

పొద్దున్నే లేస్తే చాలు మూడు కేజీలు వంద రూపాయలు అనే అరుపుతో రోడ్లమీద మామిడి పండ్ల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన షాపుల్లో మామిడి పండ్ల ధర మహా అయితే 4,5 వందలు ఉంటుందేమో. కానీ ఇదిగో ఈ మామిడి పండ్లను చూడండి.

వీటి ధర కేజీ రూ. 2.75 లక్షలు. నిజం.. మీరు సరిగ్గానే చదివారు.. కేజీ మామిడిపళ్ళు రెండు లక్షల 75వేలు. ఇంత ఖరీదైన మామిడి పశ్చిమ బెంగాల్లో అమ్మకానికి వచ్చింది. అక్కడ సిలిగుడి జిల్లా మటిగరా అనే దగ్గర ప్రస్తుతం ఒక మామిడిపళ్ళ ఉత్సవం జరుగుతోంది.

మొత్తం 262 రకాల మామిడిపళ్ళను ప్రదర్శనలో ఉంచారు. అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ మియాజాకీ రకం మామిడిపండ్లు. మామూలు మామిడి పండ్లు కంటే వీటి సైజ్ కాస్త పెద్దగా ఉంటుంది. అంటే కేజీకి మహా అయితే రెండు మామిడి పళ్ళు రావడం గగనమెమో. ఇక తీయదనం కూడా ఒక 15% వరకు ఎక్కువగా ఉంటుంది.

అంటే మనం అసలు ఎలాంటి మామిడి పండు ముట్టుకున్న అది తీయగానే ఉంటుంది అన్నమాట. వీటిని భారత్ తో సహా చాలా దేశాల్లో సాగు చేస్తారు. అయితే ముందుగా జపాన్లోని మియాజాకీ అనే నగరంలో ఈ మామిడి చెట్లు బయటపడడంతో వాటికి ఆపేరే స్థిరపడిపోయింది. ఈ పండ్ల రంగు కూడా కాస్త ప్రత్యేకంగా అనిపిస్తుంది. జపాన్ లో ఎగ్స్ ఆఫ్ సన్ అని పిలుస్తారట. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, బీటాకేరోటిన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి. కంటిచూపుని మెరుగు పరుస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story