మిజోరం ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని వరించిన విజయం

మిజోరం ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని వరించిన  విజయం
సీఎం కాబోతున్న ఇందిరాగాంధీ భద్రతాధికారి

మిజోరంలో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ZPM అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు అవసరం కాగా 27 చోట్ల జయభేరి మోగించింది. ప్రస్తుతం మిజోరంలో అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్‌- MNF 10 స్థానాలకే పరిమితమైంది. ZPM నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న లాల్‌దుహోమ....సమీప ప్రత్యర్థి మల్సావుజ్మపై దాదాపు 3 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. గత ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే దక్కించుకున్న ZPM ఈ సారి మరో 19 స్థానాలు పెంచుకుని 27 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో 23 చోట్ల అభ్యర్థుల్ని బరిలోకి దించిన భాజపా 2 స్థానాల్లో విజయం సాధించింది. 2018 ఎన్నికల్లో భాజపా కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. గత ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఈ సారి ఒక స్థానంతో సరిపెట్టుకుంది. మిజోరం ఎన్నికల్లో తొలిసారి పాల్గొని నలుగురు అభ్యర్థులను బరిలోకి దించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు.

ఈ ఎన్నికల్లో సీఎం జోరంథంగా, ఉప ముఖ్యమంత్రి తాన్‌లుయా సహా MNFకు చెందిన పలువురు మంత్రులు పరాజయం పాలయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కంభంపాటి హరిబాబును కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చారు సీఎం జోరామ్‌ తంగా. ఎన్నికల్లో ఓటమిని ఊహించలేదన్నారు. మిజోరం అసెంబ్లీకి 40 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 21 కాగా, మిజోరం మరో ఆరు ఎక్కువ సీట్లకే కైవసం చేసుకుంది.

మిజోరామ్‌కు CMగా 74 ఏళ్ల లాల్‌దూ హోమా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈయన IPSగా పనిచేసి, ఒకప్పడు ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. మిజో మిలిటెంట్‌ గ్రూప్‌ లీడర్‌ లాల్‌ డెంగాతో ఇందిర ప్రభుత్వం చర్చలకు వెళ్లినపుడు, ఉద్యోగానికి రాజీనామా చేశారు. మిజోరాం రాష్ట్రంగా 1987లో ఏర్పడినపుడు రాజీవ్‌ సారధ్యంలో శాంతిఒప్పందంపై సంతకం చేశారు. ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై, మూడుసార్లు CMగా పనిచేశారు.


మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7న పోలింగ్‌ జరిగింది. మిజోరంలో మొత్తం 8.57 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 80 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జోరం పీపుల్స్ మూవ్‌మెంట్‌ ఆరు పార్టీల కూటమి. ఇందులో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరామ్ నేషనలిస్ట్ పార్టీ, జోరామ్ ఎక్సోడస్ మూవ్‌మెంట్, జోరామ్ డిసెంట్రలైజేషన్ ఫ్రంట్, జోరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్, మిజోరం పీపుల్స్ పార్టీ. ఈ పార్టీలన్నీ జెడ్‌పీఎం కూటమిగా అసెంబ్లీ బరిలోకి దిగాయి. జీపీఎం స్థాపించిన కొద్ది ఏళ్లలోనే మిజోరంలో గణనీయంగా దీని ప్రాధాన్యతను సంపాదించుకుంది. ఈ పార్టీని 2017లో స్థాపించారు. తొలిసారి 2018 మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో 40 సీట్లలో పోటీ చేసి.. కేవలం ఆరు సీట్లలో విజయం సాధించింది. ఆ మరుసటి ఏడాది కేంద్ర ఎన్నికల సంఘం నుంచి జీపీఎం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది.

Tags

Read MoreRead Less
Next Story