MLC Kavitha: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్

MLC Kavitha: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
రుతుక్రమ పోరాటాలను మహిళా సంక్షేమ శాఖ మంత్రే కొట్టిపడేశారని ఆగ్రహం

మహిళల్లో రుతుక్రమం వైకల్యం కాదని, వేతనంతో కూడిన సెలవు అక్కర్లేదంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజ్యసభలో వ్యాఖ్యానించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. స్వయంగా కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రే రాజ్యసభ సాక్షిగా రుతుక్రమ పోరాటాలను కొట్టిపారేయడం నిరుత్సాహం కలిగించిందని అన్నారు. ఒక మహిళగా అటువంటి అజ్ఞానాన్ని చూడడం భయంకరంగా అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుతుక్రమంపై మహిళల పోరాటాలు, ప్రయాణాలకు ఓదార్పు దక్కలేదన్నారు. రుతుక్రమంపై మహిళల పోరాటాలు సముచితమైనవని, దీనిపై చర్చ అక్కర్లేదని ఎంఎల్సీ కవిత అన్నారు.

జ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు స్మృతి ఇరానీ సమాధానం ఇస్తూ.. మహిళల్లో నెలసరి అనేది వైకల్యం కాదు.. అదొక సహజ ప్రక్రియ. నెలసరి సెలవులు పని ప్రదేశంలో వివక్షకు దారి తీయొచ్చుఅని ఆమె అభిప్రాయ పడ్డారు. ఈ క్రమంలో మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించారు. మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. స్త్రీ జీవితంలో అదొక సహజ ప్రక్రియ.. ఈ సెలవుల వ‌ల్ల పని ప్రదేశంలో వారు వివక్షకు గురికావ‌చ్చు. రుతుక్రమం పట్ల ప్రత్యేక దృక్పథం ఉన్నందున మహిళలకు సమాన అవకాశాలు నిరాకరించిన సమస్యలను మనం ప్రతిపాదించకూడదు' అని ఆమె చెప్పారు. అలాగే మ‌హిళ‌ల పీరియ‌డ్స్ సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింద‌ని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ఆమె అన్నారు.

రుతుక్రమం ఒక చాయిస్ కాదని, జీవ వాస్తవికమని గుర్తించాలని సూచించారు. అయితే వేతనంతో కూడిన సెలవు అక్కర్లేదని తిరస్కరించడమంటే అసంఖ్యాకమైన స్త్రీలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్టేనని కవిత వ్యాఖ్యానించారు. మహిళలు ఎదుర్కొంటూ పోరాటం చేస్తున్న వాస్తవికమైన సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం ఒక మహిళగా విస్తుగొల్పుతోందని మండిపడ్డారు. విధాన రూపకల్పన, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన సమయం ఇదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కవిత స్పందించారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్త పత్రికల కటింగ్స్‌ను ఆమె షేర్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story