Monkey snatching :దొంగ కోతి.. రూ. లక్ష ఎత్తుకుపోయింది

Monkey snatching :దొంగ కోతి..  రూ. లక్ష ఎత్తుకుపోయింది
రూ.1 లక్ష ఉన్న బ్యాగ్‌ని లాక్కెళ్లిన కోతి

అసలే కోతి. పని పాటు ఉండదు కాబట్టి ఖాళీగా ఉంది. తినడానికి ఏముందో వెతుకుతోంది.. అప్పుడే దాని ద్రుష్టి ఓ బ్యాగ్ మీద పడింది. బాగుంది కదా వాడుకుందాం అనుకుందేమో. దానిని ఎత్తుకువెళ్ళింది. తీరా తీసుకుపోయిన బ్యాగ్ లో లక్ష రూపాయలు ఉండటం తో బ్యాగ్ యజమాని కోతి వెంట పడ్డాడు..


అప్పుడప్పుడు కోతులు ఇళ్లలోకి రావడం, దొరికినవి ఎత్తుకుపోవడం మమ్ములే.. అరటిపళ్లు, కొబ్బరి ముక్కలు, వంట సామానులు వరకు కూడా ఒకే.. కానీ అవి ఒక్కోసారి విలువైన వస్తువులు కూడా తీసేస్తుంటాయి. వాటికి తెలియదు కదా ఏది ఏంటో..

ఇలాంటి సంఘటనే ఉత్తర్ ప్రదేశ్ రాంపూర్ లో ఈ జరిగింది. మంగళవారం షహాబాద్ లోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సేల్ డీడ్ కోసం వచ్చిన షరాఫత్ హుస్సేన్ అనే వ్యక్తి బ్యాగ్ ను బైక్ కి పెట్టి సేల్ కి సంబంధించిన పనుల్లో పడ్డాడు. కాసేపటి తర్వాత గుర్తొచ్చి చూసేటప్పటికి ఇంకేముంది బ్యాగ్ మాయం. ముందంతా ఎవరో తీసారు అనుకున్నాడు తర్వాత అనుమానం వచ్చే చూస్తే. ఓ కోతి గారు ఆ బ్యాగ్ ని తీసుకుని చక్కగా చెట్టేక్కి కూర్చున్నారు. అప్పుడు టెన్షన్ మొదలైంది అతనికి ఎందుకంటే బ్యాగ్ లో ఉన్నది అక్షరాల లక్ష రూపాయలు. విషయం తెలుసుకున్న వాళ్ళందరు ఇంక కోతి వెనుక పడ్డారు. కోతి నుంచి బ్యాగ్ ని తీసుకునేందుకు జనాలు రకరకాలుగా ప్రయత్నించారు. చివరికి బ్యాగ్ ను వదిలి కోతి వెళ్ళిపోయింది. ఫైనల్ గా హుస్సేన్ తన బ్యాగ్ లో ఉన్న లక్ష రూపాయలను తిరిగిపొందగలిగాడు.

ఈ దెబ్బకి షహాబాద్‌లో కోతుల బెడద పెరుగుతున్న దృష్ట్యా వాటిని పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టేందుకు ఒక బృందాన్ని నియమించనున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story