Madhya Pradesh Rape: శిక్ష అనుభవించినా బుద్దిరాలేదు..

Madhya Pradesh Rape:   శిక్ష అనుభవించినా బుద్దిరాలేదు..
జైలు నుంచి విడుదలై మైనర్‌పై అత్యాచారం

జైళ్లు శిక్ష ఖైదీల్లో మార్పు తీసుకురావాలి.. చేసిన తప్పే కాదు, మరో కొత్త తప్పు కూడా వారు చేయకుండా ఉండేలాగా వారిని మార్చాలి. కానీ అలాంటిది ఏది జరగటం లేదు అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే..చేసిన నేరానికి ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించినా ఆ ఖైదీలో మార్పు రాకపోగా, గతంలో చేసిన నేరమే మళ్లీ చేశాడు. ఓ బాలికపై అత్యాచారం కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించిన దోషి, జైలు నుంచి విడుదలయ్యాక మరో అయిదేళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది..

రాకేష్ వర్మ అనే వ్యక్తి 2012వ సంవత్సరంలో కోల్గ్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. దోషిగా తేలడంతో రాకేష్ వర్మకు కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. జైలుకు వెళ్లిన తరువాత సత్ప్రవర్తన కారణంగా అతని మూడేళ్ల జైలు శిక్షను రద్దు చేశారు. ఏడాదిన్నర క్రితం అతను జైలు నుంచి బయటకు వచ్చాడు.

ఇప్పుడు రాకేష్ వర్మ మరో మైనర్ బాలికపై అదే నేరానికి పాల్పడ్డాడు. చిన్నరికి మిఠాయిలు తినిపిస్తానని మాయమాటలతో ప్రలోభపెట్టినట్లు తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని పోలీసులు చెబుతున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాధిత బాలిక కనిపించకుండా పోవడంతో బాలిక అమ్మమ్మ ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. కొంత దూరంలో రక్తసిక్తమైన స్థితిలో బాలిక కనిపించింది. అప్పుడే

ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఆమెను రేవాలోని సంజయ్ గాంధీ మెడికల్ ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదికల్లో తేలిందని పోలీసులు నిర్ధారించారు. నిందితుడు రాకేష్ వర్మ బాలికపై అత్యాచారం చేసి పారిపోయాడని భావిస్తున్నారు. అతను ఆటోలో పారిపోవడం చూసామని చెబుతుండటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story