Honey trap: కోడి రక్తాన్ని వాడి కోట్లు కొట్టేసారు

Honey trap: కోడి రక్తాన్ని వాడి కోట్లు కొట్టేసారు
బిజినెస్ మాన్ ను బురిడీ కొట్టించిన కిలాడిలేడీస్

ఇప్పటివరకు ఏ కోడి రక్తంతోనో లవ్ లెటర్ రాసి మనుషుల్ని ట్రాప్ చేయడం చూశాను కానీ ఇది అంతకు మించి.. ఓ వ్యాపారిని హనీ ట్రాప్ చేయడానికి ఇద్దరు మహిళలు కోడి రక్తాన్ని వాడుకున్నారు. నీ వల్లే మాకు ఇలా జరిగింది అంటూ వాళ్ళు చేసిన హడావిడికి భయపడి ఆ వ్యక్తి ఇప్పటికే రూ. 3.25 కోట్లు ఇచ్చుకున్నాడు. ఆశ్చర్యపరిచే ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

కొల్హాపూర్‌కు చెందిన ఓ వ్యాపారితో మోనిక , సప్నా అనే ఇద్దరు యువతులకు 2017లో పరిచయం ఏర్పడింది. సుమారు రెండేళ్ల పాటు ఆ వ్యాపారి ఆస్తిపాస్తులు, ఆర్ధిక స్థోమతను ఆ ఇద్దరూ స్టడీ చేశారు. వ్యాపారిని హనీ ట్రాప్ ఉచ్చులో ఇరికించాలనే ప్లాన్ ను 2019లో రెడీ చేశారు. ఓ రోజు ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఆ వ్యాపారి ఉండగా..అతడున్న రూమ్ కు వెళ్లారు. బయట ఒక వ్యక్తిని కెమెరాతో రెడీగా ఉంచారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో బిజినెస్ మ్యాన్ నిద్రమత్తులోకి జారుకున్నాడు.ఇద్దరు మహిళలు అతన్ని లూటి చేశారు అంతే కాదు తనతో అతను ప్రవర్తించాడంటూ కోడి రక్తాన్ని తీసుకొని ఒక డ్రామా క్రియేట్ చేశారు. వెంటనే కెమెరామెన్తో అంతా వీడియో తీయించుకున్నారు పోలీసులకు సమాచారం ఇస్తామని చెబుతూ బ్లాక్ మెయిలింగ్ గేమ్ ను షురూ చేశారు.


తరువాత ఇంకో రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో.. చేసేది లేక ఆ వ్యాపారి 2021 నవంబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబైలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు జరిపిన విచారణలో దిమ్మ తిరిగే విషయం బయటపడింది. ఆ ఇద్దరూ కోడి రక్తాన్ని శరీరానికి పూసుకొని, నిద్రమత్తులో ఉన్న ఆ వ్యాపారి పక్కన పడుకొని, ఏడుస్తున్నట్టుగా ఫోజులు పెట్టి ప్లాన్డ్ గా వీడియో తీయించుకున్నారని దర్యాప్తులో తేలింది. పోలీసు కస్టడీలో ఈ విషయాన్ని ఇద్దరు కిలాడీ మహిళలు సప్నా, మోనిక ఒప్పుకున్నారు. వీడియో తీసిన లుబ్నా వజీర్ తో పాటు హనీ ట్రాప్ ప్లాన్ వేయడంలో ఇద్దరు మహిళలను తెర వెనుక నుంచి నడిపించిన అనిల్ చౌదరిని కూడా అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story