IndiGo flight: విమానం గాల్లో ఉండగా రక్తపు వాంతులు

IndiGo flight: విమానం గాల్లో ఉండగా రక్తపు వాంతులు
62 ఏళ్ల ప్రయాణికుడు మృతి... క్షయతో బాధపడుతున్నాడన్న వైద్యులు

విమాన ప్రయాణంలో విషాదం నెలకొంది. ముంబై నుంచి రాంచీ(Mumbai to Ranchi ) వస్తున్న ఇండిగో విమానం(IndiGo flight )లో ఓ ప్రయాణికుడు మరణించడం విషాదాన్ని మిగిల్చింది. 62 ఏళ్ల ప్రయాణికుడు‍( 62-year-old passenger) విమానం గాల్లో ఉండగా రక్తపు వాంతులు( vomiting blood) చేసుకుని మరణించాడు. ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విమానాన్ని నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఉన్న కిమ్స్-కింగ్స్‌వే ఆసుపత్రి వైద్య బృందం అతనికి చికిత్స అందించింది. ఆసుపత్రి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ప్రయాణికుడు క్షయ, క్రానిక్ కిడ్నీ వ్యాధి (CKD)తో బాధపడుతున్నాడు. విమానంలో ఆ ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకున్నాడని తోటి ప్రయాణికులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story