70వ పడిలోకి అడుగు పెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ

70వ పడిలోకి అడుగు పెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పడిలోకి అడుగు పెట్టారు. ఇవాళ ఆయన పుట్టినరోజు నేపథ్యంలో సేవా సప్తాహ్‌ని పాటించాలని బీజేపీ నిర్ణయించింది. అంటే వారం రోజుల పాటు వివిధ సేవా..

భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పడిలోకి అడుగు పెట్టారు. ఇవాళ ఆయన పుట్టినరోజు నేపథ్యంలో సేవా సప్తాహ్‌ని పాటించాలని బీజేపీ నిర్ణయించింది. అంటే వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రజలకు శానిటైజర్లు, మాస్కులు, మందులు పంపిణీ చేస్తారు. అలాగే రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే బీజేపీ శ్రేణులు, ఆయన అభిమానులు వేడుకల్లో నిమగ్నమయ్యారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచుకున్నారు. కరోనా వైరస్ కారణంగా తన పుట్టిన రోజును నిరాడంబరంగా నిర్వహించుకోవాలని మోదీ నిర్ణయించారు.

మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. మోదీ జీవితంలోని కొన్ని ప్రత్యేక సందర్భాలను గుర్తు చేస్తూ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఆయన జీవితానికి సంబంధించిన విశేషాలతో రూపొందించారు.

70 సంఖ్యను ప్రతిబింబిస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ శ్రేణులంతా సేవా వారోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా అధిష్టానం ఆదేశించింది. మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత విశేషాలు, సాధించ తలపెట్టిన లక్ష్యాలను వివరిస్తూ 70 వర్చువల్ కాన్ఫరెన్స్‌లను వెబినార్ ద్వారా నిర్వహించనున్నారు. మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో కీలక ఘట్టాలకు సంబంధించిన 70 స్లైడ్స్‌ను సోషల్ మీడియాలో ప్రచారం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story