బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్ట్

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో లింక్ లను కనిపెట్టే ప్రయత్నంలో డ్రగ్స్ కేసుపై విచారణ చేస్తోంది..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో లింక్ లను కనిపెట్టే ప్రయత్నంలో డ్రగ్స్ కేసుపై విచారణ చేస్తోంది మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సిబి).. ఈ క్రమంలో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు.. తాజాగా మాదకద్రవ్యాల సేకరణ మరియు వినియోగం ఆరోపణలపై మంగళవారం బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని అరెస్టు చేసింది ఎన్‌సిబి. అరెస్టు చేసిన మరో ముగ్గురు నిందితుల తోపాటు ఆమెను సెప్టెంబర్ 9 న కోర్టుకు హాజరుపరుస్తారు. తదుపరి విచారణ కోసం ఈ నలుగురినీ పోలీసు రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం ఉందని ఎన్‌సిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story