Delhi: అంతర్జాతీయ మాదకద్రవ్యాల గుట్టు రట్టు

Delhi: అంతర్జాతీయ మాదకద్రవ్యాల గుట్టు రట్టు
సాఫ్ట్వేర్ ఉద్యోగులు భారీ మొత్తంలో ఆర్జించే నిపుణులే టార్గెట్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, భారీగా ఆర్జించే నిపుణులే లక్ష్యంగా దేశవ్యాప్తంగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఓ ముఠా గుట్టును మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో NCB పట్టుకుంది. తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లతో కొరియర్ల ద్వారా డ్రగ్స్‌ సరఫరా సాగుతోందని గుర్తించింది. జూన్‌ నుంచి ఇప్పటివరకూ రెండు పెద్ద డ్రగ్స్‌ కార్టెల్స్‌ గుట్టురట్టు చేసి 22మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. భారతదేశంలో మాదకద్రవ్యాల వ్యాపారంపై పెద్ద ఎత్తున అణిచివేసేందుకు ఎన్‌సిబి చేసిన కృషిని ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. తన అభినందనలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు .

దేశంలో మరో అతిపెద్ద మాదక ద్రవ్యాల రాకెట్‌ గుట్టు రట్టు చేశామని జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో-NCB ప్రకటించింది. 13 వేల 863 LSD బ్లాట్లు, 428 గ్రాముల MDMA, 26.73 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. జూన్‌లో 15 వేల LSD బ్లాట్లను పట్టుకుని అరడజను మందిని అరెస్ట్ చేయగా, ఢిల్లీ జోనల్ యూనిట్‌ ద్వారా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మూడు LSD కార్టెల్స్‌ను గుర్తించినట్లు వివరించింది. వాటిలో ఇప్పటివరకూ రెండు కార్టెల్స్‌ను పట్టుకున్నట్లు తెలిపింది. ఇందులో ఒకటి 5స్టార్‌ రేటింగ్‌ గలవారికి డ్రగ్స్‌ విక్రయించే జాంబాడా కార్టెల్‌ భారతీయ కార్టెల్‌ అని ప్రకటించింది. ఈ రెండు ఘటనల్లో6 కేసులు నమోదు చేసి 22మంది భారతీయులను అరెస్ట్ చేశారు.


దేశ రాజధాని దిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరులోని వృత్తి నిపుణులే లక్ష్యంగా నిందితులు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు NCB వివరించింది. 21 నుంచి 25 ఏళ్ల యువతను నియమించుకుని డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు వీరు సామాజిక మాధ్యమాల్లోనే డ్రగ్స్‌ కోసం సంప్రదిస్తారని తెలిపింది. తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లతో కొరియర్ల ద్వారా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని అలాగే మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసే వారు క్రిప్టోకరెన్సీల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారని అమ్మేవారు, కొనుగోలుదారుల మధ్య నేరుగా మాటలు ఉండనే ఉండవని అందుకే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చాపకింద నీరులా సాగిపోతోందని చెప్పింది.

భవిష్యత్ లో మరో డార్క్‌నెట్‌ కార్టెల్స్‌ గుట్టు రట్టు చేసేందుకు... పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగుతోందని వివరించింది. ఎల్‌ఎస్‌డీ లేదా లైసెర్జిక్‌ యాసిడ్ డైఇథలమైడ్‌గా పిలిచే ఈ మాదక ద్రవ్యాన్ని సింథటిక్‌ రసాయనాలతో తయారు చేస్తారు. ఇది తీసుకున్నవారికి తీవ్రమైన భ్రాంతిని కలగిస్తుందని అధికారులు తెలిపారు. దీనిని తీసుకుంటే యువత అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతారని ప్రాథమిక సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story