బీహార్ లో మ్యాజిక్ ఫిగర్ స్థానాలను దాటిన ఎన్టీయే కూటమి

బీహార్ లో మ్యాజిక్ ఫిగర్ స్థానాలను దాటిన ఎన్టీయే కూటమి
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలను ఎన్టీయే కూటమి దాటేసింది. దీంతో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు..

బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలను ఎన్టీయే కూటమి దాటేసింది. దీంతో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 125 స్థానాల్లో ఆధిక్యం సంపాందించగా.. మహాఘట్ బందన్ 111 స్థానాల్లో ఆధిక్యం సాధించింది.

ఇక చిరాగ్ పాశ్వన్ నేతృత్వంలోని ఎల్జేపీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది. అయితే ఆర్జేడీ కూటమిని కాంగ్రెస్ స్థానాలు తీవ్రంగా దెబ్బకొట్టాయి. 70 స్థానాల్లో పోటి చేసిన కాంగ్రెస్ కేవలం 20 స్థానాల్లో మాత్రం ఆధిక్యంలో నిలిచింది.

నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచి అతి పెద్ద పార్టీగా నిలిచింది. అయినా కానీ నితీష్‌ కుమారే తమ సీఎం అభ్యర్థి అని ఎన్డీఏ స్పష్టంచేసింది. దీంతో నితీష్ ఇంటికి బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story