Nikki Haley: ట్రంప్‌ జైత్రయాత్రకు బ్రేక్‌

Nikki Haley: ట్రంప్‌ జైత్రయాత్రకు బ్రేక్‌
రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీలో నిక్కీ హేలీకి తొలి విజయం

అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ ఎట్టకేలకు తొలి విజయం సొంతం చేసుకున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా ప్రైమరీ ఎన్నికల్లో హెలీ గెలుపొందారు. హేలీ విజయంతో అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న ట్రంప్ విజయ పరంపరకు అడ్డుకట్ట పడింది. అయితే ట్రంప్ ను అధిగమించాలంటే పలు ప్రైమరీల్లో నిక్కీ భారీ గెలుపు నమోదు చేయాల్సి ఉంటుంది. సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలోనూ నిక్కీ ఓడిపోయారు. అయినప్పటికీ రేసు నుంచి వైదొలగడానికి నిరాకరించారు. ఓవైపు ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. ఆయనకు ప్రత్యామ్నాయం తానేనంటూ నిక్కీ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ మిసోరి, మిషిగన్ , ఐడహో ప్రైమరీల్లోనూ నిక్కీపై ఘన విజయం సాధించారు. ఆయన నెగ్గిన ప్రతినిధుల సంఖ్య 244కు చేరుకుంది. హేలీ ఖాతాలో 24 మంది మాత్రమే ఉన్నారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలవాలంటే 1,215 మంది ప్రతినిధులను సొంతం చేసుకోవాలి. ప్రస్తుతం ట్రంప్ దూకుడు చూస్తుంటే ఈ సంఖ్యను రేపు జరిగే 15 రాష్ట్రాల ప్రైమరీల్లో సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా జరిగిన మిస్సోరి, మిచిగన్‌, ఐదహొ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు భావిస్తున్నారు. మంగళవారం జరిగే సూపర్‌ ట్యూస్‌డేలో డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ మద్దతుదారులు...అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌, రిపబ్లికన్ పార్టీల తరఫున పోటీపడే అభ్యర్థిని ఎన్నుకునేందుకు...ట్యూస్‌డేనాడు ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఆరోజు

అన్నిరాష్ట్రాల్లోని ఇరుపార్టీల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొంటారు. రిపబ్లికన్‌ పార్టీకి మొత్తం 2,429 మంది ప్రతినిధులు ఉండగా...అధ్యక్ష అభ్యర్థిత్వం పొందటానికి 1,215 మంది మద్దతు కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌నకు 244మంది ప్రతినిధుల మద్దతు లభించింది. మంగళవారం జరిగే ఓటింగ్‌లో ట్రంప్‌నకు 874 ఓట్లు వస్తే... అధ్యక్ష ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారవుతుంది. రిపబ్లికన్‌ పార్టీ తరఫున ట్రంప్‌తో పోటీ పడుతున్న దక్షిణ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీకి 24మంది మద్దతే ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీపడాలంటే...మంగళవారం జరిగే పోలింగ్‌లో 1,191 మంది ప్రతినిధులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అద్భుతం జరిగితే తప్ప అంత మంది మద్దతు పొందటం సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story