No Confidence Motion: రాహుల్ క్షమాపణ చెప్పాలన్న స్మృతి ఇరానీ

No Confidence Motion: రాహుల్ క్షమాపణ చెప్పాలన్న స్మృతి ఇరానీ
భారత మాతను హత్య చేశారంటే కాంగ్రెస్ నాయకులు బల్లలు చరుస్తున్నారు

భారత దేశాన్ని మణిపూర్ లో చంపారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి స్కృతి ఇరానీ. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్వానంపై రెండో రోజు పార్లమెంట్ లో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మణిపూర్ లో జరిగిన హింసపై కాంగ్రెస్ పార్టీ పలు ప్రశ్నలను లేవనెత్తింది. ముందుగా మాట్లాడిన రాహుల్ గాంధీ ... భారత మాతను మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం హత్య చేసిందన్నారు. మణిపూర్ ప్రజలను చంపి బీజేపీ నాయకులు దేశద్రోహులయ్యరని అన్నారు. రావణుడు ఇద్దరు మాటలనే నమ్మేవాడని అందులో ఒకరు మేఘనాథుడు, రెండవది కుంభకర్ణుని అలాగే.. మోదీ కూడా అమిత్ షా, అదాని మాటనే విని నిర్ణయాలు తీసుకుంటున్నాడని అందుకే మణిపూర్ లో హింస జరుగుతోందని అన్నారు. రావణుడి లంకను హనుమంతుడు కాల్చలేదని రావణుడి అంహకారమే కాల్చిందని చెప్పాడు.


రాహుల్ వాఖ్యలపై ఫైర్ అయ్యారు స్కృతి ఇరానీ. తన మాటలను వినే ధైర్యాన్ని విపక్షాలకు ఉండాలని కోరుతూ... విరుచుకుపడ్డారు. దేశ చరిత్రలోనే భారతమాతను హత్య చేశారని రాహుల్ గాందీ అంటే కాంగ్రెస్ నాయకులు బల్లలు చరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ విభజిత ప్రాంతం కాదని ఈ దేశంలో ఒక భాగమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మణిపూర్ దేశంలో ఒక భాగం కాదని ప్రచారం చేయడం దురదృష్టకరమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలే భారతదేశమంటే కేవలం ఉత్తర భారతమని గతంలో అన్నారని... నిజంగా గాంధీ ఫ్యామిలీలో దేశ భక్తే ఉంటే ఆ వ్యాఖ్యలను ఖండించాలని కోరారు.

కశ్మీర్ పై కాంగ్రెస్ నాయకులు రిఫెరెండమ్ నిర్వహించాలని అడిగారని విరుచుకుపడ్డారు. ఇలాంటివాళ్లు 'ఇండియా' కాదని ఈ దేశంలో అవినీతిని పెంచినవారని ఫైర్ అయ్యారు. కశ్మీర్ లో జరిగిన హింస ను కాంగ్రెస్ నాయకులు కల్పితమన్నారని చెప్పారని... కాంగ్రెస్ హయాంలోనే మహిళలను బస్సులో నుంచి లాక్కెళ్లి హింసించిన ఘటనలు జరిగాయని వాటిని ఆ పార్టీ పట్టించుకోలేదని తెలిపారు. కశ్మీర్ పండితుల బాధలు కాంగ్రెస్ కు తెలియవా అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ సమస్యకు పరిష్కారం సూచించిందని అన్నారు. ఇప్పుడు అక్కడ శాంతి నెలకొందని స్పష్టం చేశారు. మణిపూర్ భారత్ లో భాగమని పలు మార్లు తెలిపారు ఇరానీ. మణిపూర్ లో భారత మాతను హత్య చేశారన్న వ్యాఖ్యలపై రాహుల్ క్షమాపన చెప్పాలని ఆవిడ డిమాండ్ చేశారు.





Tags

Read MoreRead Less
Next Story