KV: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాపై కేంద్రం స్పష్టత

KV: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాపై కేంద్రం స్పష్టత
ఎంపీ కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదన్న కేంద్రం

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalayas) ప్రవేశాలకు పార్లమెంట్‌ సభ్యుల కోటా( MP Quota )పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ విద్యా సంస్థల్లో ఎంపీ( Members of Parliament) కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు రాజ్యసభ( Rajya Sabha)లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి(Union Minister of State for Education Annpurna Devi ) లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ విద్యా సంస్థలను ప్రాథమికంగా రక్షణ, పారా మిలటరీ, కేంద్ర అటానమస్‌ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసినవని వివరించారు.


ర‌క్షణ‌, పారా మిలిట‌రీ, కేంద్ర స్వయం ప్రతిప‌త్తి సంస్థలు, ప‌బ్లిక్ సెక్టార్ అండ‌ర్ టేకింగ్స్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ‌య్యర్ లెర్నింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో(central government employees) ప‌ని చేసే సిబ్బంది త‌రచూ బ‌దిలీల‌పై వెళ్తుంటారు. కాబ‌ట్టి వారి పిల్లల చ‌దువుకు ఆటంకం క‌ల‌గ‌కుండా దేశవ్యాప్తంగా ఒకే విధ‌మైన విద్య(common programme of education)ను నేర్చుకునేందుకు వీలుగా కేంద్రీయ విద్యాసంస్థలను ప్రారంభించారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థుల పరిమితి(student strength of 40 per section) దాటిపోతోందన్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతోందని వివరించారు. గతంలో ఒక్కో ఎంపీ ఒక కేవీలో 10 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సిఫారసు చేసేందుకు వీలుండేది. మొత్తం 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ సభ్యులు కలిపి కేవీల్లో ఏటా తమ కోటా కింద 7,880 మంది విద్యార్థుల ప్రవేశాలకు సిఫారసు చేసేవారు.

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం ఎంపీలతో సహా అనేక విచక్షణ కోటాలను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రద్దు చేసింది. ఈ నిర్ణయం కేంద్ర నిధులతో నడిచే పాఠశాలల్లో 40,000 సీట్లకు పైగా ఖాళీని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో 14.35 లక్షల మంది విద్యార్థులతో 1,200 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. కేవీలలో స్పాన్సరింగ్ అథారిటీ కోటా కింద 17 మంది విద్యార్థులను సిఫారసు చేసే అధికారం జిల్లా మేజిస్ట్రేట్‌కు కూడా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story