కరోనా భారిన పడి పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

కరోనా భారిన పడి పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి

కరోనా భారిన పడి అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్, ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ శేఖర్ బసు మరణించారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. శేఖర్ బసు పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ప్రసిద్ధులు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆసుపత్రిలో చేరారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ గురువారం కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. మెకానికల్ ఇంజనీర్ అయిన డాక్టర్ బసు.. దేశంలో అణు ఇంధన అభివృద్ధికి బాగా కృషి చేశారు. ఇదిలావుంటే గడిచిన 24 గంటల్లో భారత్‌లో 86,508 కేసులు నమోదు కాగా, 1129 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 87,374 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story