Supreme Court: బలగాలు మోహరించండి... శాంతి కాపాడండి

Supreme Court: బలగాలు మోహరించండి... శాంతి కాపాడండి
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం... హరియాణ అల్లర్ల నేపథ్యంలో ర్యాలీలకు పిలుపునిచ్చిన హిందూ సంఘాలు...

హరియాణలో అల్లర్ల‍(communal violence)కు నిరసనగా విశ్వహిందూ పరిషత్(Vishwa Hindu Parishad), భజరంగ్ దళ్ సహా హిందూ సంఘాలు ర్యాలీలు నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియాణ రాష్ట్ర ప‍్రభుత్వాలకు సుప్రీంకోర్టు( Supreme Court) కీలక నోటీసులు జారీ చేసింది. హరియాణా అల్లర్లకు నిరసనగా దేశ రాజధాని ప్రాంతం-NCR పరిధిలో ఎలాంటి విద్వేష ప్రసంగాలు( no hate speech ), హింసాత్మక ఘటనలకు తావులేకుండా చూడాలని ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది(Supreme Court’s directions ). బజరంగ్ దళ్ , విశ్వహిందూ పరిషత్ తలపెట్టిన ర్యాలీల్లో విద్వేష ప్రసంగాలు, హింసాత్మక ఘటనలకు తావు లేకుండా గట్టిచర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.


ఈమేరకు అదనంగా పోలీసులు, పారా మిలిటరీ బలగాల(para-military force be deployed)ను మోహరించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. దేశ రాజధాని ప్రాంతం-NCRలో బజ్ రంగ్ దళ్ , విశ్వహిందూ పరిషత్ లు 23ప్రదర్శనలకు పిలుపునిచ్చాయంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసింది.

హరియాణ ఘటనకు నిరసనగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. మేవాత్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిరసనలకు పిలుపునిచ్చింది. మానేసర్‌లో భిసమ్ దాస్ మందిర్ వద్ద భజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మహా పంచాయత్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అల్లర్లు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ర్యాలీలకు అనుమతించవద్దని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. హిందూ సంఘాల పిలుపుతో నారిమన్ విహార్ మెట్రో స్టేషన్ పరిధిలో బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి.


హరియాణలోని నూహ్ జిల్లాలో నిర్వహించిన ఓ ర్యాలీ సందర్భంగా రెండు వర్గాల మధ్య మతపరమైన ఘర్షణ చెలరేగింది. ఈ హింస కారణంగా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నూహ్‌లో మొదలైన గొడవలు క్రమంగా బాద్ షాపూర్ కు 70 కిలోమీటర్ల దూరంలోని గురుగ్రామ్‌కు వ్యాపించాయి. సుమారు రెండు వందల మంది అల్లరి మూకులు గురుగ్రామ్‌లోకి కర్రలు, ఆయుధాలతో వచ్చి విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు.

హరియాణలో జరిగిన అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు 44 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. హరియాణ అల్లర్లలో హింస చెలరేగడానికి కారణం అయిన 70 మందిని అరెస్టు చేశామని, మరికొంత మంది కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. హరియాణలో పరిస్థితి అదుపులోకి తీసుకురావానికి స్థానిక పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story