Kuno National Park: కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుతపులి మృతి..

Kuno National Park: కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుతపులి మృతి..
ఇప్పటి వరకు 10 చిరుతలు మృత్యువాత

మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటైన శౌర్య మంగళవారం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం చీతా తూలుతూ నడవడాన్ని గుర్తించిన ట్రాకింగ్‌ బృందం బలహీనంగా ఉన్న ఆ చీతాకు వెంటనే చికిత్స అందించారు. ఆ తర్వాత అది కాస్త కోలుకున్నట్లే కన్పించినా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చీతా చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం తర్వాతే మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందన్నారు. దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టు చీతాను చేపట్టింది. ఇందులో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు రప్పించారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో విడిచిపెట్టారు. ఇందులో ఆరు చీతాలు పలు కారణాలతో చనిపోయాయి. గతేడాది మార్చిలో జ్వాల అనే మరో నమీబియా చీతాకు నాలుగు కూనలు పుట్టగా, అనారోగ్య కారణాలతో అందులో మూడు మృతి చెందాయి. తాజా ఘటనతో ఇప్పటివరకు మరణించిన చీతాల సంఖ్య 10కి చేరింది.

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుతపులి మృతి చెందింది. ఈ విషయాన్ని పార్క్ అధికారులు ధృవీకరించారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన శౌర్య అనే చిరుత కునో నేషనల్ పార్క్‌లో చనిపోయిందని చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చిరుత మృతి చెందినట్లు లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న శౌర్యను అటవీ అధికారులు గుర్తించారు. వెంటనే చికిత్స అందించేందుకు యత్నించినా శౌర్య ప్రాణాలు కాపాడలేకపోయారు.

చిరుతపులి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోస్ట్‌మార్టం తర్వాత మాత్రమే తెలుస్తాయని అధికారులు తెలిపారు. చిరుత ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి కునో నేషనల్ పార్క్‌లో శౌర్యతో సహా 10 చిరుతలు చనిపోయాయి. 2022లో దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి వీటిని తీసుకొచ్చారు. చిరుత ప్రాజెక్ట్‌లో భాగంగా సెప్టెంబర్ 17న నమీబియా నుంచి శౌర్యను ఇక్కడికి తీసుకువచ్చారు. నమీబియా నుంచి మొత్తం 8 చిరుతపులిలను తీసుకొచ్చారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను కూడా తీసుకొచ్చారు. భారతదేశంలో పూర్తిగా అంతరించిపోయిన ఈ జాతిని కాపాడేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. కునో నేషనల్ పార్క్‌లో మొత్తం 20 చిరుతపులులను వదిలారు. మరణించిన 10 చిరుతపులిలలో, కునో పార్క్‌లోనే జన్మించిన మూడు పిల్లలు కూడా ఉన్నాయి. ఆడ చిరుత జ్వాల కునో పార్క్‌లోనే 4 పిల్లలకు జన్మనిచ్చింది. వీటిల్లో మూడు వేర్వేరు కారణాలతో చనిపోయాయి. వాటిల్లో ఒక పులి పిల్ల పార్క్‌లో ఉంది. అది పూర్తి ఆరోగ్యంగా ఉంది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య 17. వాటిల్లోఆరు మగ, ఏడు ఆడ, నాలుగు పిల్లలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story