కొత్తగా ఆన్‌లైన్ ఛానల్స్‌ ఓపెన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి

కొత్తగా ఆన్‌లైన్ ఛానల్స్‌ ఓపెన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరి
ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ తోపాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో , హాట్‌స్టార్ వంటి కంటెంట్ ప్రొవైడర్లను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు..

ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ తోపాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో , హాట్‌స్టార్ వంటి కంటెంట్ ప్రొవైడర్లను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకువస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలోని వార్తలకు కూడా ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలోని చలనచిత్రాలు, ఆడియో-విజువల్స్ , వార్తలు అన్ని మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు, డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించే చట్టం లేదా స్వయంప్రతిపత్త సంస్థ లేదు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రింట్ మీడియాను చూసుకుంటుంది, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) న్యూస్ ఛానెళ్లను పర్యవేక్షిస్తుంది, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటనల కోసం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్‌సి) సినిమాలను చూసుకుంటుంది. కానీ డిజిటల్ పోర్టల్స్ కు మాత్రం ఎటువంటి స్వయంప్రతిపత్త సంస్థ లేకపోవడంతో విచ్చలవిడిగా ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ ఆన్‌లైన్ లోకి వచ్చేస్తుంది. దాని వలన చాలా అనర్ధాలు జరుగుతున్నాయని. ఈ క్రమంలో ఆన్‌లైన్ ఫ్లాట్ ఫామ్ ను ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకువచ్చినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

స్వయంప్రతిపత్త సంస్థ ద్వారా ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించాలన్న పిటిషన్‌పై గత నెలలో సుప్రీంకోర్టు కేంద్రం స్పందన కోరింది. కేంద్రం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. OTT ప్లాట్‌ఫామ్‌లలో న్యూస్ పోర్టల్స్ , హాట్స్టార్, నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సేవలు ఉన్నాయి, ఇవి ఇంటర్నెట్ లేదా ఆపరేటర్ నెట్‌వర్క్‌ ద్వారా వర్క్ అవుతాయి. OTT / స్ట్రీమింగ్ తోపాటు విభిన్న డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫిల్మ్ మేకర్స్ , ఆర్టిస్టులకు సంబంధించిన సినిమాలకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు , సెన్సార్ బోర్డు నుండి అనుమతి లేకుండా కంటెంట్‌ను విడుదల చేయడానికి అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Online News Media, Including Social Sites, Now Under Government Control

Tags

Read MoreRead Less
Next Story