LS polls: 71 వేల మంది డిపాజిట్‌ గల్లంతు

LS polls: 71 వేల మంది డిపాజిట్‌ గల్లంతు
డిపాజిట్‌ దక్కకున్నా పోటీకి సై..

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్‌ కట్టాల్సిందే. అయితే ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు తమ డిపాజిట్‌ కోల్పోయారో తెలుసా? ఎన్నికల సంఘం వద్ద ఉన్న డాటా ప్రకారం.. 1951 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 71 వేల మంది లోక్‌సభకు పోటీ చేసిన అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్‌ కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 91,160 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 71,246 మంది (78 శాతం) ధరావతు గల్లంతైంది.

ఎన్నికల్లో ఎంతోమంది పోటీ చేస్తూ ఉంటారు. ఒక్కో స్థానంలో చాలా మంది అభ్యర్థులు బరిలో ఉంటారు. చివరికి ఒక్కరే విజయం సాధిస్తారు. ఇక కొందరికి అయితే చాలా తక్కువ ఓట్లు వస్తాయి. కొందరు డిపాజిట్లు కూడా కోల్పోతూ ఉంటారు. అంటే ఎన్నికల్లో పోటీ చేసే ముందు వారు డిపాజిట్ చేసిన సొమ్మును పొందేందుకు కనీస ఓట్లు కూడా సాధించకుండా ఉంటారు. ఈ క్రమంలోనే దేశంలో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 71 వేల మంది ఇలా డిపాజిట్లు తిరిగి పొందేందుకు కనీస ఓట్లు సాధించలేదు. దీంతో వారి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఎన్నికల కమిషన్ అధ్యయనంలో ఈ లెక్క బయటపడింది.

ఈ కనీస ఓట్లు అనేదానికి ఎన్నికల సంఘం ఒక ప్రాతిపదికను సూచించింది. గెలిచిన అభ్యర్థిలో ఆరో వంతు ఓట్లు పడితేనే ఓడిన అభ్యర్థికి కట్టిన డిపాజిట్‌ వాపస్‌ ఇస్తారు. ఆరో వంతు ఓట్లు పడకపోతే సొమ్ము పోయినట్టే లెక్క. ఆ సొమ్మును ట్రెజరీకి జమ చేస్తారు. 2019 ఎన్నికల్లో 86 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. తొలి లోక్‌సభ (1951-52)లో 1,874 మంది బరిలో నిలవగా 745 మంది(40 శాతం)కి డిపాజిట్‌ దక్కలేదు. ప్రతి సారి డిపాజిట్‌ దక్కని వారి సంఖ్య పెరుగుతూ పోతున్నది.

ఇలా 1951-52 లో దేశంలో తొలిసారి నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల దగ్గరి నుంచి ఇప్పటివరకు దాదాపు 71 వేల మంది తమ సెక్యూరిటీ డిపాజిట్‌ కోల్పోయినట్లు ఎన్నికల సంఘం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఈ డిపాజిట్లను కాపాడుకోవడంలో జాతీయ పార్టీలు ముందున్నట్లు అందులో తెలుస్తోంది.




Tags

Read MoreRead Less
Next Story