Parliament Session: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు…

Parliament Session:  నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు…
కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులపై అందరి ద్రుష్టి..

నేటి (సోమవారం) నుంచి సెప్టెంబరు 22 వరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగనున్నాయి. తొలి రోజు పాత పార్లమెంట్ భవనంలోనే సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 9: 30 గంటలకు పాత పార్లమెంట్ ముందు పార్లమెంట్ సభ్యులతో గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుంది. మొదటిరోజు 75 సంవత్సరాల పార్లమెంటరీ వ్యవస్థ ప్రయాణం – విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అభ్యాసాలు అనే అంశంపై చర్చ జరుగనుంది. వినాయక చవితి పర్వదినాన కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాల నిర్వహించనున్నారు.

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై నెలకొన్న సస్పెన్స్‌ వీడకముందే సమావేశాలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఘన చరిత్ర కలిగిన పార్లమెంట్‌ పాత భవనంలో సోమవారం సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం మంగళవారం నుంచి కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం అఖిలపక్ష భేటీని నిర్వహించింది. 1946 డిసెంబరు 9న తొలిసారిగా జరిగిన పార్లమెంట్ సమావేశాల నుంచి మొదలు పెట్టి ఈ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చించిఈ ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


ప్రత్యేక సమావేశాలు తొలి రోజు పాత భవనంలోనే జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. “తొలిరోజు రాజ్యాంగ పరిషత్ నుంచి పార్లమెంట్ వరకు 75 ఏళ్ల ప్రయాణం, సాధించిన విజయాలు, అనుభవాలు, ఇంకా నేర్చుకున్న విషయాలపై చర్చ జరుగుతుంది’’ అని ఆయన ఆదివారం మీడియాతో చెప్పారు.

రెండో రోజు నుంచి కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. రేపు (మంగళవారం) కొత్త పార్లమెంట్ భవనం ముందు ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హల్ లో కేంద్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. లోక్ సభ ముందుకు ధి అడ్వాకేట్ అమెండమెంట్ బిల్ 2023, ధి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పెరియడికల్స్ బిల్ 2023 రానున్నాయి. రాజ్యసభ ఆమోదం కోసం ధి పోస్ట్ ఆఫీస్ బిల్ 2023, ఎలెక్షన్ కమిషనర్ ఎలెక్షన్ కమిషన్ సిబ్బంది నియామకాలకు సంబంధించిన బిల్లులు సభ ముందుకి రానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story