Criminal Law Bills: మూడు క్రిమినల్ లా బిల్లులకు లోక్‌సభ ఆమోదం

Criminal Law Bills:  మూడు క్రిమినల్ లా బిల్లులకు లోక్‌సభ ఆమోదం
విపక్ష ఎంపీలు లేకుండానే

ఐపీసీ, CRPC, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో.. కేంద్రం తెచ్చిన మూడు నూతన క్రిమినల్‌ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులపై చర్చ, కేంద్రం సమాధానం అనంతరం 3 బిల్లులకు సభ... ఆమోదముద్ర వేసింది. బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా...భారతీయత, రాజ్యాంగస్ఫూర్తిని ప్రతిబింబించేలా దేశ ప్రజల హితం కోరి.. నూతన క్రిమినల్ బిల్లులు తెచ్చినట్లు ప్రకటించారు. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలను నూతన బిల్లులు భర్తీ చేస్తాయని ఆయన ప్రకటించారు. ప్రజలకు న్యాయం చేసేందుకు నూతన చట్టాల్లోసాంకేతికతకు ప్రోత్సాహం ఇచ్చినట్లు చెప్పారు. మూక హత్యలను నేరంగా పరిగణించినట్లు చెప్పారు. బ్రిటిష్ చట్టాలు వారి రాజరిక పాలనను రక్షించుకునేందుకు తెస్తే తాము ప్రజలే కేంద్రంగా నూతన బిల్లులను తెచ్చామన్నారు. తీవ్రవాద చర్యలకు పాల్పడే వారికి కఠినశిక్ష పడాల్సిందేనని అమిత్ షా స్పష్టంచేశారు. ఎవరైనా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వారిని శిక్షించరాదన్న ఆయన.. అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పారు. సీఆర్‌పీసీలో 484 సెక్షన్లు ఉండగా కొత్త బిల్లులో 531 సెక్షన్లు చేర్చినట్లు వివరించారు. 177 సెక్షన్లలో మార్పులు చేసి.... 9 సెక్షన్లు అదనంగా చేర్చామని తెలిపారు. 39 సబ్‌ సెక్షన్లు, 44 నూతన ప్రొవిజన్లు చేరాయని అమిత్ షా అన్నారు.

లోక్ సభ ఆమోదం పొందిన మూడు నేర సంబంధిత బిల్లుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక అంశాలను పొందుపరిచింది. కొత్త బిల్లులో మొత్తం 33 నేరాలకు జైలు శిక్షను పెంచారు.83 నేరాల్లో జరిమానాను పెంచారు. పాత చట్టంలో హత్యా నేరానికి 302 సెక్షన్ ఉండగా కొత్త బిల్లులో దానిని 101వ సెక్షన్ గా..మార్చారు. దేశమంతా జీరో FIR నమోదుతో పాటు... ఎలక్ట్రానిక్ పద్ధతిలో కూడా FIR నమోదు చేయవచ్చంటూ బిల్లులో..పేర్కొన్నారు. మూక హింసకు మరణ దండన శిక్ష విధింపును చేర్చారు. నేర జాబితా నుంచి ఆత్మహత్యా యత్నాన్ని తొలగించగా.... సత్వర న్యాయానికి సమయాన్ని నిర్దేశించారు. భిక్షాటనను మానవ అక్రమ రవాణ నేరంగా పరిగణించాలని కూడా బిల్లులో పేర్కొన్నారు. లింగ జాబితాలో ట్రాన్స్ జెండర్లను చేర్చారు. 5 వేల రూపాయల లోపు చోరీకి సమాజ సేవ శిక్ష విధించాలని బిల్లులో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story