Paytm Layoffs: పేటీఎంలో ఉద్యోగాల కోత..

Paytm Layoffs: పేటీఎంలో  ఉద్యోగాల కోత..
ఈసారి 1,000 మందికిపైగా ...

ప్రముఖ స్టార్టప్ కంపెనీ పేటీఎం మరోమారు ఉద్యోగుల తొలగింపు చేపడుతోందని ప్రచారం జరుగుతోంది. ఈసారి దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను ఇంటికి పంపించిందని, మరింత మందిని సాగనంపే ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. ఖర్చుల నియంత్రణ, పునర్వవస్థీకరణ పేరుతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లో ఈ తొలగింపులు జరుగుతాయని అనధికారిక సమాచారం.

ఈ ఏడాది మన దేశంలోని స్టార్టప్ కంపెనీలకు పెద్దగా కలిసిరాలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వివిధ స్టార్టప్ కంపెనీలు ఈ ఏడాది మొదటి మూడు త్రైమాసికాలలో ఏకంగా 28 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. గతేడాది ఈ సంఖ్య 20 వేలు ఉండగా.. 2021 లో 4 వేల మంది ఉద్యోగులు తమ జాబ్ కోల్పోయారు. ఫిన్ టెక్ రంగంలో ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు విషయానికి వస్తే పేటీఎం టాప్ లో ఉంది. సంస్థ వర్క్ ఫోర్స్ లో దాదాపు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉద్యోగుల తొలగింపు ప్రభావం స్టాక్ మార్కెట్ పైనా పడింది. పేటీఎం షేర్ల వాల్యూ దాదాపు 28 శాతం పడిపోయింది. గడిచిన ఆరు నెలల్లో పేటీఎం షేర్ ధర 23 శాతానికి పైగా తగ్గింది.

పేటీఎంలోని వివిధ విభాగాల్లో సుమారు 1,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపు ప్రభావం పేమెంట్స్‌, సేల్స్‌, ఆపరేషన్స్‌ వంటి విభాగాలపై పడింది. ఈ తొలగింపు మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని ప్రభావితం చేయనుంది. సిబ్బంది ఖర్చులను 15 శాతం మేర తగ్గించడంలో భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story