NDA Meeting: ఇండియాకు పోటీగా "న్యూ ఇండియా"

NDA Meeting: ఇండియాకు పోటీగా న్యూ ఇండియా
ఎన్డీఏకు ప్రధాని మోదీ కొత్త నిర్వచనం... ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని వెల్లడి... విపక్షాలకు పోటీగా ఎన్డీఏ బల ప్రదర్శన..

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే దిశలో నేషనల్‌ డెమోక్రటిక్‌ అలియన్స్‌(NDA) కూటమి కీలక భూమిక పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్‌-న్యూ ఇండియా( new India), డి-డెవలప్ నేషన్‌(developed nation), ఎ-యాస్పిరేషన్‌ ఆఫ్‌ పీపుల్‌(aspirations of people)’’ అంటూ ఎన్డీఏకు మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు. అందులో ఎన్‌ ద్వారా నవ భారతం కోసం, డీ ద్వారా అభివృద్ధి చెందిన దేశం కోసం, ఏ ద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమన్నారు.. దేశంలో పేద, మధ్యతరగతి, యువకులు, మహిళలు, దళితులు, గిరిజనులు సహా అందరి విశ్వాసం ఎన్డీయేపై ఉందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.


NDAను ఓడించేందుకు విపక్షాలు ఏకమైన వేళ దిల్లీలో భాజపా బల ప్రదర్శన నిర్వహించింది. పాత మిత్రులకు ఆహ్వానం పలికేందుకు భాజపా నేతృత్వంలో ఏర్పాటు చేసిన NDA భేటీకి 38 పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. పుదుచ్చేరి సీఎం N రంగస్వామి, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిందే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, నాగాలాండ్ సీఎం నీఫియు రియో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకి హాజరయ్యారు.


కేవలం ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంతో ఎన్డీఏ( BJP-led NDA) ఏర్పాటు కాలేదన్న ప్రధాని...దేశంలో స్థిరత్వం తీసుకొచ్చేందుకే వచ్చిందని వివరించారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే.. దేశ ప్రగతి మార్చగలదని పేర్కొన్నారు. స్థిర ప్రభుత్వం వల్లే ప్రపంచ దేశాలకు భారత్‌పై నమ్మకం పెరిగిందని వివరించారు. వచ్చే 25 ఏళ్ల ప్రణాళికతో ప్రగతి కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని మోదీ(Prime Minister Narendra Modi) తెలిపారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక భూమిక పోషించిందన్నారు. మిత్ర పక్షాలు వివిధ రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయన్నారు.


ఎన్డీఏ ఏర్పాటై 25 ఏళ్లు అయిందన్న ప్రధాని, రాష్ట్రాల అభివృద్ధి వల్లే దేశ అభవృద్ధి సాధ్యమని గుర్తు చేశారు. ఆత్మనిర్భర్‌, అభివృద్ధి చెందిన భారత్‌ కోసం లక్ష్యం సాకారానికి కృషి చేశామని అన్నారు. భారతీయులు కొత్త సంకల్పంతో ముందడుగు వేస్తున్నారని తెలిపారు. కోట్లాది మంది భారతీయులు ప్రస్తుతం నూతన సంకల్పంతో, నవోత్సాహంతో నిండి ఉన్నారన్న ప్రధాని, ఈ మహత్తర కాలంలో ఎన్డీయే పాత్ర చాలా కీలకమన్నారు. ఒకవైపు నూతనోత్సాహంతో నిండి ఉన్న మూడు శక్తులు ఉన్నాయని మోదీ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story