PM Modi : : జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు ఫోన్ చేసిన ప్ర‌ధాని మోదీ

PM Modi : : జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌కు ఫోన్ చేసిన ప్ర‌ధాని మోదీ
ట్వీట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మాక్ పార్ల‌మెంట్ నిర్వ‌హించి రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్‌ పై మిమిక్రీ చేసిన విప‌క్ష స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌ను ప్ర‌ధాని మోదీ ఖండించారు. మాక్ పార్ల‌మెంట్ ఘ‌ట‌న దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప్ర‌ధాని అన్నారు. ఆ ఘ‌ట‌న ప‌ట్ల బాధ‌ను వ్య‌క్తం చేసిన ప్ర‌ధాని.. రాజ్య‌స‌భ చైర్మెన్ జ‌గ‌దీప్‌కు ఫోన్ చేసి త‌న విచారాన్ని తెలిపారు. అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పట్ల టీఎంసీ ఎంపీ మిమిక్రీతో హేళన చేయడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ప్రాంగణంలో అవమానించిన తీరుచూసి విస్తుపోయానని అన్నారు. ఎన్నికైన ప్రతినిధులు తమ భావాలను వ్యక్తీకరించడానికి స్వేచ్ఛగా ఉండాలని, కానీ, వారి వ్యక్తీకరణ గౌరవ మర్యాదలకు లోబడి ఉండాలని ద్రౌపది ముర్ము అన్నారు.

శీతాకాల సమావేశాల నుంచి సస్పెన్షన్ కు గురైన విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ చైర్మన్, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్ ను మిమిక్రీ చేస్తూ హేళన చేశాడు. మిగిలిన ప్రతిపక్ష ఎంపీలు పెద్దపెట్టున నవ్వడం ప్రారంభించారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకూడా అక్కడే ఉన్నారు. టీఎంసీ ఎంపీ తీరుపట్ల పలువురు బీజేపీ ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీలోనిడిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో టీఎంసీ ఎంపీపై ఫిర్యాదుసైతం నమోదైంది. ఎంపీపై అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.


ద్రౌపది ముర్ముఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కర్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి విషయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఎంపీల దారుణమైన ప్రవర్తనపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. జగ్‌దీప్ ధన్కర్ ట్వీట్ ప్రకారం.. ప్రధాని నరేంద్ర మోదీ నాకు ఫోన్ చేశారు. కొంతమంది ఎంపీల దారుణమైన ప్రవర్తనపై ఆయన చాలా బాధను వ్యక్తంచేశారు. టీఎంసీ ఎంపీ మిమిక్రీ చేసి హేళన చేయడం పట్ల ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. అయితే.. నేను ప్రధానితో చెప్పారు.. కొద్దిమంది ఎంపీలు తనను హేళన చేసినంత మాత్రాన నన్ను నిరోధించలేరు. నా కర్తవ్యాన్ని నిర్వర్తించడం, మన రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలను సమర్థించడం నా బాధ్యత. ఇలాంటి అవమానాలు ఏవీ నన్ను నా మార్గాన్ని మార్చేలా చేయవు అని ప్రధానికి తెలియజేసినట్లు ఉపరాష్ట్రపతి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story