Pm Modi : రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Pm Modi : రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ
ఓబీసీ కోటాపై కొనసాగుతున్న మాటల యుద్ధం..

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 17వ తేదీన జరుగుతున్నాయి. మరో రెండు రోజులైతే క్యాంపెయిన్ ముగిసిపోనుంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు హామీలు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్‌లో ఓ ప్రజాకర్షక హామీని ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ వాసులను అయోధ్యలోని రామ మందిరానికి తీసుకెళ్లుతామని హామీ ఇచ్చారు. దఫాలుగా ఇక్కడి నుంచి ప్రజలు తీసుకెళ్లి రామ మందిరం దర్శనం చేయిస్తామని చెప్పారు.

అలాగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉద్యోగ అవకాశాల్లో ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదని రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు. ఈ అంశాన్ని ఆయన ప్రధాన అజెండాగా తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి ఓబీసీ రిజర్వేషన్లను ఇవ్వలేదని, పైగా ఆ రిజర్వేషన్లను వ్యతిరేకించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పి కొట్టారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ “కాంగ్రెస్ మనస్తత్వాన్ని మీరు గుర్తించాలి. పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ప్రభుత్వాన్ని నడిపింది ఇదే కాంగ్రెస్. ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ప్రజలు ఇచ్చారు. కానీ ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వని కాంగ్రెస్‌ ఇదే. మెడికల్ కాలేజీల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయని కాంగ్రెస్ ఇదే’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంలో ఓ బీజేపీ నేత తాము అయోధ్య మందిర దర్శనం కోసం డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి ఉంటుందా? అని ప్రశ్నించగా.. దీనికి అమిత్ షా సమాధానం ఇస్తూ ఈ హామీ ఇచ్చారు. అయోధ్య రామ మందిర దర్శనం కోసం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. మధ్యప్రదేశ్‌లో మరోసారి బీజేపీకి అధికారం కట్టబెడితే తామే రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని తాము తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ప్రకటించామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story