Joe Biden : గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బైడెన్‌

Joe Biden : గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బైడెన్‌
జీ20 సమావేశాల్లోనే బైడెన్‌ను ఆహ్వానించిన మోదీ

భారత గతణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈసారి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు. ఈ మేరకు వచ్చే ఏడాది జనవరి 26న భారత్ నిర్వహించుకునే రిపబ్లిక్ డే వేడుకలకు జో బైడెన్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానించినట్టు ఆయన పేర్కొన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన జీ20 సమావేశాల్లో భాగంగా జరిగిన ద్వైపాక్షి చర్చల సందర్భంగా ఈ ఆహ్వానం అందించినట్టు తెలిపారు.

ఇటీవలే ఢిల్లీలో జరిగిన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల సమయంలో బైడెన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, భారత్‌ ప్రతి ఏడాది గణతంత్ర వేడుకలకు ప్రపంచ దేశాల నేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా భారత్‌ ఆహ్వానాన్ని అంగీకరించి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు బైడెన్‌ కూడా మోదీ ఆహ్వానాన్ని అంగీకరిస్తే.. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికా రెండో అధ్యక్షుడిగా బైడెన్‌ నిలుస్తారు. నిజానికి భారత రిపబ్లిక్ వేడుకలకు ‘క్వాడ్’ నేతలందరినీ ఆహ్వానించాలని భారత్ భావించినట్టు తొలుత వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటివారు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ప్రపంచ నేతల అందుబాటును బట్టి తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు బైడెన్ అంగీకరించినట్టు కూడా తెలుస్తోంది. భారత్ గణతంత్ర వేడుకలు జరుపుకునే జనవరి 26నే ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో అదే రోజు జరిగే క్వాడ్ నేతల సమావేశానికి కూడా ప్రధాని అల్బానీస్ హాజరు కావడం లేదని సమాచారం. వచ్చే ఏడాది క్వాడ్ నాయకత్వ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఇచ్చిన ఈ ఆహ్వానం కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది. గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి వ్యూహాత్మక, దౌత్య, వాణిజ్య , అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో భారతదేశ మొదటి గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇప్పటివరకు.. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ ప్రతినిధులను ఒక్కొక్కరు గరిష్టంగా 5 సార్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రధాని మోడీ ఆహ్వానాన్ని జో బిడెన్ అంగీకరిస్తే.. గణతంత్ర వేడుకల్లో పాల్గొనున్న రెండో అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ నిలుస్తారు.

Tags

Read MoreRead Less
Next Story