స్వదేశానికి తిరిగి వచ్చిన మోదీ

స్వదేశానికి తిరిగి వచ్చిన మోదీ
అమెరికా, ఈజిప్ట్‌ దేశాలతో పలు కీలక ఒప్పందాలు

ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్‌ దేశాల పర్యటనల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో మోదీకి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాకాశీ లేఖి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు స్వాగతం పలికారు.

ఆరు రోజుల అమెరికా, ఈజిప్ట్‌ దేశాల పర్యటన విజయవంతం అయ్యింది. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా అమెరికా, ఈజిప్ట్‌లో చారిత్రక ఒప్పందాలు చేసుకున్నారు. ఈనెల 20న స్టేట్ విజిట్ కోసం అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ. ఈ నెల 21వ తేదీన ఐరాసలో ప్రపంచ యోగా దినోత్సవం పాల్గొన్నారు. 135 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ ఈవెంట్‌కు మోదీ నేతృత్వం వహించడం విశేషం. యూఎన్‌లో జరిగిన ఈ యోగా వేడుకలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది.

వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌కు ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ చేసిన భారీ స్వాగత కార్యక్రమంలో 21 తుపాకుల గౌరవ వందనం స్వీకరించారు. అమెరికా కాంగ్రెస్‌లో చారిత్రాత్మక ప్రసంగం చేశారు మోదీ. విదేశాలలోని భారతీయ ప్రముఖులతో దేశంలో పెట్టుబడులు వంటి అంశాలపై చర్చించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్‌హౌస్‌లో భారత ప్రధాని మోదీకి విందు ఇచ్చారు. ఈ స్టేట్ డిన్నర్‌లో ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఇంద్రానూయి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబీ సీఈఓ శంతను నారాయణ తదితరులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చలు జరిపిన ప్రధాని మోదీ..భారత్‌లో యుధ్ద విమానాల ఇంజన్ల తయారీకి జీఈ ఏరో స్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు.


అనంతరం తొలిసారిగా ఈజిప్ట్ పర్యటనకు వెళ్లారు మోదీ. రాజధాని కైరోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. రిట్జ్‌ కార్ల్‌టన్‌ హోటల్‌లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సీసీ తో చర్చలు జరిపారు. ఇరువురు నేతలు నాలుగు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశారు. అనంతరం ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ద నైలు’ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సీసీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story