ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలి : ప్రధాని మోదీ

ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలి : ప్రధాని మోదీ
దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ... ప్రజలకు భద్రత కల్పిస్తున్న సైన్యానికి సలాం చేస్తూ... ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని.. మన్ కి బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ కోరారు..

దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ... ప్రజలకు భద్రత కల్పిస్తున్న సైన్యానికి సలాం చేస్తూ... ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని.. మన్ కి బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ కోరారు. సైనికుల్ని స్మరించుకున్నాకే మనం పండుగలు చేసుకోవాలని సూచించారు. ఈ దేశం మొత్తం వారితో ఉందని దీపాల ద్వారా తెలపాలన్నారు. మన్‌ కీ బాత్‌లో దసరా శుభాకాంక్షలు తెలిపిన మోదీ.. కరోనా ఇంకా తగ్గలేదని... పండుగలు జరుపుకుంటూనే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వోకల్ ఆఫర్ లోకల్‌ నినాదాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రజలంతా దేశీయంగా తయారయ్యే వస్తువులను పండుగ రోజుల్లో వాడాలని సూచించారు. దేశంలో ఐకమత్యం, ఏకత్వం కోసం జరిగే ప్రక్రియలో.. విరాళాలు ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. కేంద్రం నడుపుతున్న ekbharat.gov.in ద్వారా విరాళాలు ఇవ్వాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story