నేడు ప్రధాని మోదీ ఈజిప్ట్ పర్యటన

నేడు ప్రధాని మోదీ ఈజిప్ట్ పర్యటన
1997 తరువాత ఈజీప్ట్ కు భారత ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా ఆ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజులపాటు ఆయన బిజీబిజీగా గడిపార. అనంతరం ఈరోజు ఆయన ఈజిప్టు పర్యటనకు బయలుదేరారు. రెండు రోజులపాటు ఈజిప్టులో పర్యటించనున్నారు. 1997 తర్వాత తొలిసారిగా ఒక భారత ప్రధాని ఈజీప్ట్ పర్యటనకు వెళుతున్నారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా హాజరయ్యారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన ప్రధాని మోడీని తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరారు. ప్రధాని ఈజిప్టు పర్యటనలో భారతీయ సంతతిని, ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటారు. అంతే కాదు ఈ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మోడీ కైరోలోని హీలియో పోలీస్ కామన్వెల్త్ వార్ గ్రేవ్ ను సందర్శిస్తారు. స్మశాన వాటికను ఒక ప్రధాని సందర్శించటానికి కారణం ఈజిప్ట్, పాలస్తీనా లకు సేవ చేసి మరణించిన భారతీయ సైన్యానికి చెందిన నాలుగువేల మంది సైనికుల స్మారక చిహ్నం ఇది. మొదట నిర్మించిన స్మారకాన్ని 1970లో జరిగిన ఇజ్రాయిల్- ఈజిప్టు యుద్ద సమయంలో ధ్వంసం చేశారు. తరువాత దీనిని తిరిగి నిర్మించారు. చివరి రోజున మోది 11వ శతాబ్దంలో నిర్మించిన అల్ హకీమ్ చారిత్రక మసీదును సందర్శించనున్నారు. మోడీ పర్యటన దృష్ట్యా చారిత్రిక మసీదును అద్భుతంగా ముస్తాబు చేశారు. మసీదు గోడలు, అంతస్తులను తివాచీలతో అలంకరించారు. భారతదేశంలోని దావూదీ బోహ్రో ముస్లింలకు ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశం. షియా ముస్లిం లలో ఇది ఒక తెగ. వీరితో మోడీకి గత కొన్ని సంవత్సరాలుగా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఈరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి. వ్యవసాయము, చిన్న -మధ్యతరహా పరిశ్రమలు, సమాచార, సాంకేతిక, సాంస్కృతి, వాణిజ్య వంటి అంశాలు ఈ ఒప్పందాలలో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య రక్షణ స్పేస్ టెక్నాలజీ రంగాల్లో పలు ఒప్పందాలు కుదిరాయి. ప్రముఖ జీప్ కంపెనీ మైక్రాం భారత్ లో పెట్టుబడులకు ఓకే చెప్పింది. ప్రముఖ కంపెనీల సీఈఓ లతో మోడీ భేటీ అయ్యారు. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.

Tags

Read MoreRead Less
Next Story