Pm modi: పుట్టినరోజున యశోభూమి కన్వెన్షన్‌ ప్రారంభం

Pm modi: పుట్టినరోజున యశోభూమి కన్వెన్షన్‌ ప్రారంభం
దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించిన మోదీ

దిల్లీలోని ద్వారకాలో నిర్మించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ -IICC ఫేజ్ -1ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. 5 వేల 400 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అత్యానిధుక సముదాయానికి యశోభూమిగా నామకరణం చేశారు. ప్రారంభోత్సవం తర్వాత యశోభూమిలో పర్యటించిన మోదీ అక్కడ ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలించారు. తర్వాత చేతివృత్తుల కళాకారులతో ముచ్చటించారు. వారుతయారుచేసిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. దేశంలో సభలు, సమావేశాలు, కాన్ఫరెన్సులు ఎగ్జిబిషన్ల నిర్వహణ కోసం ఇందులో అద్భుతమైన వసతులను కల్పించారు.


1.8 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సముదాయంలో మొత్తం 15 కన్వెన్షన్ హాళ్లు, ఆడిటోరియాలు, 13 సమావేశ మందిరాలు ఉన్నాయి. వీటిలో ఒకేసారి 11వేల మంది భేటీ కావచ్చు. దేశంలోనే అత్యంత భారీ LED మీడియా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 6వేల మంది కూర్చునేలా..ఆడిటోరియం తీర్చిదిద్దారు. గ్రాండ్ బాల్ రూమ్ లో 2 వేల 500 మంది అతిథులు., ఓపెన్ ఏరియాలో మరో 500 మంది ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేశారు.



వ్యర్థ జలాల శుద్ధికి సంబంధించి గొప్ప ఆధునిక విధానం ఇందులో ఉంది. వర్షపు నీరు పొదుపునకు చర్యలు తీసుకున్న ఈ కాంప్లెక్స్ కు గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినమ్ సర్టిఫికేషన్ వచ్చినట్టు మోడీ చెప్పారు. అంతకుముందు విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతివృత్తి పని వారి ఆరాధ్య దైవం విశ్వకర్మ మహర్షికి ప్రధాని నివాళి అర్పించారు. పాదరక్షల కార్మికులతో ముచ్చటించారు.


అంతకుముందు యశోభూమి వరకు చేరుకునేందుకు వీలుగా ఉద్దేశించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో రైలు ఎక్స్ టెన్షన్ ను ప్రారంభించిన ప్రధాని, అదే మెట్రోలో ద్వారక స్టేషన్ కు చేరుకున్నారు.


ద్వారకా సెక్టార్ 21 నుంచి యశోభూమి ద్వారకా సెక్టార్ 25 వరకు రెండు కిలోమీటర్ల పొడవున ఈ లైన్ ను విస్తరించారు. మెట్రో లైన్ ప్రారంభం తర్వాత.. ప్రధాని అక్కడి ఉద్యోగులు, సిబ్బందితో కాసేపు మాట్లాడారు. అంతకుముందు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మోదీ మెట్రోలో ప్రయాణించి వచ్చారు. ధౌలా కువాన్ స్టేషన్ లో మెట్రో ఎక్కిన ప్రధాని యశోభూమి ద్వారకా సెక్టార్ 25 స్టేషన్ చేరుకునే వరకూ తోటి ప్రయాణికులతో మాట్లాడారు. మెట్రోలోని చిన్నారులతో ముచ్చటించారు.

Tags

Read MoreRead Less
Next Story