PM Modi: PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు? మోడీ చెప్పిన రీసన్ ఏంటంటే..

PM Modi: PM Modi: బీజేపీకి 400 సీట్లు ఎందుకు? మోడీ చెప్పిన రీసన్ ఏంటంటే..
వివరించిన పీఎం మోడీ..

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే షాబానో కేసు మాదిరిగానే రామ మందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మార్చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. హస్తం పార్టీ బహిరంగంగానే బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, ఇండి కూటమి ఓట్‌ జిహాద్‌కు పిలుపునిస్తోందని విమర్శించారు.దేశాన్ని ముందుకుతీసుకెళ్లేందుకు ఓట్‌ జిహాద్‌ కావాలా లేక రామరాజ్యం కావాలో ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు.

లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో ప్రతిపక్షం ఓడిపోయిందని, రెండోవిడతలో విధ్వంసమైందని, మూడోవిడతలో ఇండియా కూటమి తన వద్ద మిగిలిన స్థానాలను కోల్పోనుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు.ఎందుకంటే దేశప్రజలు మరోసారి భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఎన్నికలప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ...కాంగ్రెస్‌, ఇండియా కూటమి అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. వారసత్వ రాజకీయాలు చేసే వారు మొదట దేశచరిత్రను వక్రీకరించి, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా నేతలను ప్రజలు మరచిపోయేలా చేశారని మండిపడ్డారు. వారు తామే గొప్పవారమని ప్రజలు చెప్పుకునేలా చరిత్రను తప్పుగా రాశారని, ఇప్పుడు రాజ్యాంగంపై కూడా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. కశ్మీర్‌లో 370 అధికరణను తిరిగి పునరుద్ధరించకుండా, రామ మందిరానికి బాబ్రీ తాళం వేయకుండా, OBCకోటాను లూటీ చేయకుండా...హస్తం పార్టీని అడ్డుకునేందుకే ఎన్డీయేకు 400సీట్లు కట్టబెట్టాలని కోరుతున్నట్లు చెప్పారు. తమకు ఇదివరకే ఉన్న 400సీట్లను 370అధికరణ రద్దు, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించటానికి, ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేయటానికి వినియోగించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.

కాంగ్రెస్‌, ఇండియా కూటమి నేతలు కుహనా లౌకికవాదం పేరుతో బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. దాణా కుంభకోణంలో బెయిల్‌పై విడుదలైన ఆర్జేడీ నేత ఒకరు ముస్లింలకు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లు ఉండాలని అంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా లాక్కోని ముస్లింలకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పించాలని భావిస్తున్నట్లు...ప్రధాని మోదీ విమర్శించారు. అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సఫలం కానివ్వబోనని స్పష్టం చేశారు. ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగిన ప్రచారసభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఇండి కూటమి గడువు తేదీ జూన్‌ 4తో ముగియనుందన్నారు. ఈ ఎన్నికలు సంతృప్తి రాజకీయలు, బుజ్జగింపు రాజకీయాల మధ్య పోరాటమని ప్రధాని మోదీ పేర్కొన్నారు

Tags

Read MoreRead Less
Next Story