ఒరిస్సాలో ఫ్రీ ఆక్టివేటెడ్ సిమ్ కార్డు రాకెట్

ఒరిస్సాలో  ఫ్రీ ఆక్టివేటెడ్ సిమ్ కార్డు రాకెట్
భారీ ఓటిపి షేరింగ్ స్కామ్ ను ఛేదించిన పోలీసులు

కటక్ లోని సైబర్ క్రైమ్ పోలీసులు ఒక ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డ్ రాకెట్ను ఛేదించారు. దీనికి సంబంధించిన ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి చేసుకున్నారు. వీరిలో ఏడుగురు ఒక ప్రైవేటు టెలికాం కంపెనీకి సంబంధించిన సిబ్బంది కాగా ఒక వ్యక్తి బయటివారు.

నిందితుల నుంచి 800 కు పైగా కొత్త సిమ్ కార్డులు, 300 యాక్టివేట్ చేయబడిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 16 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరంతా యాక్టివేట్ అయి ఉన్న సిమ్ కార్డు నుంచి ఓటీపీలను జనరేట్ చేసి ఆ ఓటీపీ లను సైబర్ క్రిమినల్స్ కు అమ్మివేయడంలో సిద్ధహస్తులు. నిందితులు తమ ఓటీపీలను పాకిస్తాన్ ఇంటలిజెన్స్ ఆపరేటర్స్ కి కూడా అమ్మినట్లుగా తెలుస్తోంది. వీరికి కనీసం ఇద్దరు ఐఎస్ఐ ఏజెంట్లతో ముఖ పరిచయం ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఐ ఎస్ ఐ ఏజెంట్లను వీరు స్వయంగా కలిసి ఓటీపీలను ఇవ్వడం ద్వారా రూ.1.5 లక్షల రూపాయలు గతంలో తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. నిందితులకు మంగుళూరు ఆటో బ్లాస్ట్ తో కూడా సంబంధం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఒక వ్యక్తి తనను ఇంటి అద్దె కోసం సంప్రదించాడని, ఆ తరువాత అతని ద్వారానే తన బ్యాంకు అకౌంట్ నుంచి సుమారు 57వేలు కోల్పోయినట్టు అనుమానంగా ఉందంటూ ఓ వ్యక్తి ఏడాది క్రితం పోలీసులకు ఆరోపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన బృందం ఈ మోసానికి పాల్పడినట్లుగా తెలుసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడిని కనుగొనలేకపోయారు. తాజాగా అదే సిమ్ ఒడిశాలో ఆక్టివేట్ అయినట్టు పోలీసుల గుర్తించారు. దీని ద్వారానే ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రాష్ట్రం బయట ఉన్న ప్రధాన నిందితుడితో పరిచయం కలిగి ఉన్నారని, అతనికి వీళ్ళందరూ సిమ్ కార్డులు సప్లై చేసే టీమ్ గా పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఇలా ప్రీయాక్టివేటెడ్ సిమ్ కార్డులతో మోసాలకు పాల్పడే రాకెట్ రహస్యాలను చేదించటం కటక్ పోలీసులకి కొత్త కాదు. గత ఏడాదిలో ఇలాంటి రెండు కేసులను సాల్వ్ చేసిన పోలీసులు ఒక కేసులో ప్రధాన సూత్రధారిని కూడా అరెస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story