INS Vindhyagiri: భారత నౌకాదళంలో మరో అధునాతన యుద్ధనౌక

INS Vindhyagiri: భారత నౌకాదళంలో మరో అధునాతన యుద్ధనౌక
‘ఐఎన్ఎస్ వింధ్యగిరి’ ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము

భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో అధునాతన యుద్ధనౌక చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్‌ఎస్‌ వింధ్యగిరి యుద్ధనౌకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. కోల్‌కతాలోని హుగ్లీ నదీతీరంలో ఈ స్టెల్త్‌ యుద్ధనౌక నీటిలో ప్రవేశించింది. ఈ సందర్బమా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక స్టెల్త్‌ యుద్ధనౌక వింధ్యగిరి, ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతీక అని అన్నారు. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌, సీఎం మమతా బెనర్జీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.


అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సెన్సార్లు దీని సొంతమని, క్షిపణి దాడులతో విరుచుకుపడుతుందని యుద్ధనౌక నిర్మాణంలో పాలుపంచుకున్న ‘గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌’ అధికారులు వెల్లడించారు.వింధ్యగిరి’ అనేది కర్ణాటకలోని ఓ పర్వత శ్రేణి పేరు అన్నవిషయం మనకు తెలిసిందే. ‘ప్రాజెక్ట్‌ 17ఎ’లో భాగంగా రూపొందించిన ఆరో యుద్ధనౌక ఇది. ఇదే పేరుతో గతంలో ఉన్న యుద్ధనౌక 31 ఏళ్లపాటు సేవలందించింది. 2012 వరకు అది పలు క్లిష్టతరమైన ఆపరేషన్లలో పాల్గొని సత్తా చాటింది. ఈ యుద్ధనౌక పొడవు 149 మీటర్లు కాగా బరువు 6670 టన్నులు ఇది గంటకు 28 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.భూమి, ఆకాశం, నీటి లోపల ఎదురయ్యే ముప్పులను ఇది తిప్పికొట్టగలదు.


నౌకను నౌకాదళానికి అప్పగించే ముందు విస్తృత స్థాయిలో, వివిధ రకాలుగా పరీక్షించి చూస్తారు. ఈ పీ17ఎ’ నౌకలన్నీ తప్పనిసరిగా గైడెడ్‌ మిస్సైల్‌ సామర్థ్యం కలిగి ఉంటాయి ఉన్నాయి. భారత్ కు ఎప్పుడూ పక్కలో బల్లాలు గా ఉండే చైనా, పాకిస్థాన్ లను దృష్టిలో ఉంచుకుని… భారత్ ప్రాజెక్ట్ 17 ఆల్ఫా ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో 7 అత్యాధునిక నౌకలను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 5 యుద్ధ నౌకలు జలప్రవేశం చేశాయి. చైనా ఇప్పటికే 355 యుద్ధ నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నావికాదళాన్ని కలిగి ఉంది. అలాగే యుద్ధనౌకల తయారీలో పాకిస్థాన్ ను కూడా ప్రోత్సహిస్తూ భారత్ కు సవాళ్లు విసురుతోంది. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో, భారత్ రక్షణ రంగానికి అందులో భాగంగా నేవీని భారీగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story