Tomato price : టమాట లెస్ బర్గర్

Tomato price : టమాట లెస్ బర్గర్
పిజ్జా,బర్గర్‌లలో మాయమైన టొమాటో

టమాట లేకుండా రసం, సాంబార్ లను ఎలా ఊహించలేమొ, టమాటా స్లైస్ లేకుండా పిజ్జా, బర్గర్ లని కూడా ఊహించలేము. కానీ ఇప్పుడు సిచువేషన్ మారిపోయింది. టమాటాల ధరలు ఆకాశానికి ఎక్కి కూర్చోవడంతో అక్కడ టమాటాని చూస్తూ ఇక్కడ ఫుడ్ తినాలి. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ కూడా టమాటా లేని బర్గర్లు, శాండ్విచ్ లను మాత్రమే ఇవ్వగలమని తేల్చి చెప్పింది. ఎక్సట్రా చీజ్, డబల్ టిక్కా కు డబ్బులు పే చేసి పొందచ్చు.. కానీ కాస్త ఎక్సట్రా అమౌంట్ ఇచ్చినా టమాట దొరకదన్నమాట.





దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో టమాటా ధ‌ర‌లు మండిపోతున్నాయి. కిలో రూ.180కి చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా రెండు వంద‌లు దాటింది. ఈ క్ర‌మంలోనే మెక్‌డొనాల్డ్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి నుంచి త‌మ బ‌ర్గ‌ర్ ల‌లో టమాటాలు ఉండ‌వ‌నీ, ప్ర‌స్తుతం పెరుగుతున్న టమాటా ధ‌ర‌లు, స‌ర‌ఫ‌రా లోటు నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపింది. ఢిల్లీ మెక్‌డొనాల్డ్స్ ఉత్తర-తూర్పు శాఖలు తాత్కాలిక, కాలానుగుణ సమస్య కారణంగా టమాటాలు లేకుండా వంటకాలను అందించే చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. సీజనల్ సమస్యల కారణంగా మెనూ ఐటమ్స్ లో టమాటాలు వుండ‌వ‌ని ఒక బహిరంగ ప్రకటనలో తెలిపారు.




కొంత కాలం క్రితం ఇదే టమాటా పంట పరిస్థితి ఘోరంగా మారింది. పెట్టిన ఖర్చు కూడా రైతులకు దక్కలేదు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. రేటు కొండెక్కి కూర్చుంది. కొనేవాళ్లకి చుక్కలు చూపిస్తోంది. టమాటో ధరలు ఆకాశాన్నంటడానికి ప్రతికూల వాతావరణమే కారణమని చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో దేశంలోని చాలా ప్రాంతాలను పట్టిపీడించిన వడగాలులు చాలా ప్రాంతాల్లో టమాటో పంట ఎదుగుదలకు అంతరాయం కలిగించాయి, ఫలితంగా పంట దిగుబడి తగ్గింది. ఇదే స‌మ‌యంలో భారీ వర్షాలు మ‌రింత‌గా దెబ్బ‌కొట్టాయి. ఇది ట‌మాటో ఉత్ప‌త్తి పరిస్థితిని మరింత దిగజార్చింది. టమాటో చాలా తక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్న విషయం తెలిసిందే దీంతో ఉన్న నిల్వలు అయిపోతుండటం, కొత్తవి రాకపోవడంతో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఫలితంగా కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ప్రధాన ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story