Indian Army: ఆత్మహత్య చేసుకుంటే సైనిక లాంఛనాలు ఉండవని తేల్చేసిన ఆర్మీ

Indian Army: ఆత్మహత్య చేసుకుంటే  సైనిక లాంఛనాలు ఉండవని తేల్చేసిన ఆర్మీ
రాజౌరీ సెక్టార్‌లో సెంట్రీ డ్యూటీలో ఉండగా అమృత్‌పాల్ సింగ్ ఆత్మహత్య

సెంట్రీ విధుల్లో ఉండగా తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన అమృత్‌పాల్ సింగ్‌కు ఎలాంటి సైనిక గౌరవం లభించదని ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నిపథ్ పథకం అమలుకు ముందు లేదంటే తర్వాత సైన్యంలో చేరారా? అన్న అంశం ఇక్కడ ప్రధానం కాదని, ఆత్మహత్య వంటి స్వీయ అపరాధాలతో మరణిస్తే అంత్యక్రియల్లో సైనిక గౌరవం అందించే సాంప్రదాయం లేదని వెల్లడించింది. అగ్నివీర్ సైనికుడికి మిలటరీ గౌరవం ఇవ్వడం లేదంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించిన సైన్యం ఈ విషయాన్నిస్పష్టం చేసింది.

అ గ్నివీర్‌ గా విధులు నిర్వహిస్తున్న సైనికుడు అమృత్‌పాల్‌ సింగ్ ఇటీవలే సెంట్రీ డ్యూటీ సమయంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సైనికుడికి పంజాబ్‌లోని స్వగ్రామంలో శుక్రవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే, అమృత్‌పాల్‌ సింగ్‌కు మిలటరీ నియమాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించకపోవడంతో . దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో దీనిపై ఆర్మీ తాజాగా స్పందించింది. ఆర్మీలోని సైనికుల మధ్య ఇలా వ్యత్యాసాలు చూపబోమని స్పష్టం చేసింది. అగ్నిపథ్‌ పథకానికి ముందు.. ఆ తర్వాత సైనిక లాంఛనాల్లో ఎలాంటి బేధం ఉండదని తెలిపింది. . రాజౌరీ సెక్టార్‌లో సెంట్రీ డ్యూటీలో ఉండగా సింగ్ తుపాకితో కాల్చుకుని చనిపోయినట్టు వైట్ నైట్ కోర్ స్పష్టం చేసింది. సింగ్ మరణం దురదృష్టకరమని పేర్కొంది. ఆయన మరణానికి తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది. సింగ్ మృతి ఆయన కుటుంబానికి, భారత సైన్యానికి తీరని లోటని తెలిపింది. మెడికో లీగల్ ప్రొసీజర్ తర్వాత సింగ్ మృతదేహాన్ని ఎస్కార్ట్‌తోపాటు ఆయన స్వస్థలానికి పంపినట్టు పేర్కొంది. అయితే ఆత్మహత్య వంటి స్వీయ అపరాధాలతో మరణిస్తే అంత్యక్రియల్లో సైనిక గౌరవం అందించే సాంప్రదాయం లేదని వెల్లడించింది.

1967 ఆర్మీ ఆర్డర్ ప్రకారం ఇలాంటి కేసులు సైనిక అంత్యక్రియలకు అర్హం కావని స్పష్టం చేసింది. సైనికుల అంత్యక్రియల విషయంలో ఎలాంటి వివక్ష ఉండదని పేర్కొంది. 2001 నుంచి ఇప్పటి వరకు 100-140 మంది సైనికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆయా సందర్భాలలో కూడా సైనిక గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించలేదని వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story