Father's love :వాడు తప్పు చేశాడు అయినా వదిలేయండి

Fathers love :వాడు తప్పు చేశాడు అయినా వదిలేయండి
కాల్పులు జరిపిన కొడుకుని వదిలేయమని వాంగ్మూలమిచ్చిన తండ్రి

తన కొడుకుని కాపాడటం కోసం ఓ తండ్రి చేసిన పని కన్నీరు తెప్పిస్తోంది. తనకు హాని చేసిన తన కొడుకుకి కష్టం కలుగకూడదు అంటూ ఆ తండ్రి చెప్పిన మాట అందరినీ కదిలిస్తోంది.

నాన్న అంటే చనువు, ప్రేమతో కూడిన గౌరవం, నాన్నది ఆవేశం కాదు ఆలోచన. నమ్మకంతో కూడిన బాధ్యత. ఓర్పుకు మారుపేరు.. మార్పుకి మార్గదర్శి. అన్నీ తెలుసు కానీ ఎందుకో ఆ క్షణానికి అతనికి నాన్న మీద కోపం వచ్చింది. లైసెన్స్ గన్ తో తండ్రిని కాల్చేశాడు. ఈ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. హోషియాపూర్ జిల్లా జలాల్ చెక్క గ్రామంలో వీర్ సింగ్ అనే వ్యక్తి, ఆర్మీ మాజీ ఉద్యోగి అయిన కుమారుడు అమీర్ సింగ్ తో కలిసి నివాసం ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఏసీ సరిగ్గా పని చేయట్లేదు అంటూ తండ్రి వీర్ సింగ్ కి చెప్పాడు అమర్ సింగ్. వీలైనంత త్వరగా ఏసిని బాగు చేయించమని కోరాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆవేశం తట్టుకోలేకపోయిన కొడుకు తన దగ్గర ఉన్న లైసెన్స్ తుపాకీతో తండ్రిపై కాల్పులు జరిపాడు. తూటాలు తండ్రి రెండు కాళ్లలోకి దూసుకెళ్లిపోయాయి. స్పందించిన స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అమర్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడైన తండ్రి వాంగ్మూలం కోసం ఆసుపత్రికి వెళ్లారు. అప్పుడు తండ్రి మాటల విని పోలీసులు ఆశ్చర్య పోయారు. నా కొడుకు మద్యం మత్తులో తప్పు చేశాడు నేను వాడికి తండ్రి అయిన కారణంగా వాడిని అరెస్టు చేయించి నేను కూడా తప్పు చేయాలనుకోవడం లేదు. వాడిపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియోని ఒక జర్నలిస్టు ట్విట్టర్లో షేర్ చేశాడు. గాయపడిన తండ్రి ఆసుపత్రి మంచంపై పడుకుని ఈ మాటలు చెప్పాడు. ఆ తర్వాత కాసేపటికే అతను కన్నుమూశాడు. అయితే పోలీసులు మాత్రం పలు ఐపీసీ సెక్షన్ల కింద అమర్ సింగ్ ను అరెస్టు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story