Punjab: పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ పార్టీతో జట్టుకట్టిన బీజేపీ.. వీళ్లు కలిసినా..

Punjab: పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్‌ పార్టీతో జట్టుకట్టిన బీజేపీ.. వీళ్లు కలిసినా..
Punjab: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు ఇప్పటినుంచే సిద్దమవుతున్నాయి.

Punjab: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు ఇప్పటినుంచే సిద్దమవుతున్నాయి. భాగస్వామ్య పార్టీలతో పోత్తు విషయంలో ముందస్తు ఒప్పందాలను చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్రంలోని బీజేపీ .. మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్​ పార్టీతో కలిసి పోటిచేస్తున్నట్లు అధికార ప్రకటన చేసింది. ఎన్నికల్లో సీట్ల పంపిణీతో పాటు అనూసరించాల్సిన వ్యూహాలపై ఏడు రౌండ్లు చర్చలు ఆరాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్‌ కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు.

ప్రతి స్థానాన్ని పరిశీలించి, పరిస్థితులనుబట్టి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో నిర్ణయించుకుంటామని తెలిపారు మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌. గెలుపే ప్రధాన లక్ష్యంగా ఈ పంపకాలు ఉంటాయన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని 101 శాతం నమ్మకం ఉందన్నారు అమరీందర్ సింగ్. గెలుపులో సీట్ల పంపిణీ ప్రక్రియ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు అమరీందర్‌ సింగ్‌.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు ఊపందుకున్నాయి. పాటియాలాలోని 22 మంది కార్పొరేటర్లు సహా ఇతర కాంగ్రెస్​ నేతలు.. 'పంజాబ్ లోక్ కాంగ్రెస్​' కండువా కప్పుకున్నారు. పాటియాలాలో జరిగిన ఓ కార్యక్రమంలో.. అమరీందర్ సింగ్ కుమార్తె బిబా జై ఇందేర్ కౌర్​ సమక్షంలో ఈ నేతలంతా ఆ పార్టీలో చేరారు.

Tags

Read MoreRead Less
Next Story