Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్: అశోక్ గెహ్లాట్

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్: అశోక్ గెహ్లాట్
కూటమిలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామన్న గెహ్లాట్

2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని ప్రకటించారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్. ఇండియా’ కూటమిలోని 26 పార్టీలు పూర్తిగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇండియా కూటమి గురించి మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల్లోనూ స్థానిక అంశాలు చాలా ముఖ్యం అన్న ఆయన దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, అన్ని పార్టీలపైనా తీవ్ర ఒత్తిడి ఉందని పేర్కొన్నారు. ప్రజలే అటువంటి పరిస్థితి తీసుకొచ్చారని, దాని ఫలితమే అన్ని పార్టీల కూటమి అని వివరించారు.

ప్రధాని మోదీ అహంకారంతో వ్యవహరించకూడదని, ఎందుకంటే 2014 ఎన్నికల్లో బీజేపీ 31 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని, మిగిలిన 69 శాతం ఆయనకు వ్యతిరేకమన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. గత నెలలో బెంగళూరులో ఇండియా కూటమి సమావేశమైనప్పుడు ఎన్డీయేలో భయం కనిపించింది అన్నారు. అయితే కూటమి ఉమ్మడి అభ్యర్థి రాహుల్ అని మాత్రం చెప్పలేదు. కూటమి చర్చల తర్వాత కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని మాత్రం తెలిపారు. ఈ విషయాన్ని ఇటు కూటమి తరపున కూడా ఎవరూ ధృవీకరించలేదు, అటు గాంధీ కుటుంబం నుంచి కూడా ఇంకా ఎవరూ స్పందించలేదు.


మరోవైపు చత్తీస్గడ్ ముఖ్యమంత్రి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా రాహుల్ అయితేనే బాగుంటుందన్నారాయన. నిన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ నుంచి వస్తున్న ఈ వ్యాఖ్యల బీజేపీ స్పందించింది. ఇండియాలో మిగిలిన నాయకుల పరిస్థితేమిటని ప్రశ్నించింది.


బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్ల.. ఎక్స్(ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్పింగ్స్‌ను షేర్ చేశారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ చాలా తెలివిగా..ముంబై సమావేశానికి ముందు రాహుల్ గాంధీని కూటమికి ప్రధాన ముఖంగా ఉంచింది. రాహుల్ కుటుంబం సమ్మతితో భూపేష్ బఘెల్, అశోక్ గెహ్లాట్ ఇద్దరూ ఈ విషయాన్ని తెలిపారు. మరి అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, మమతా బెనర్జీ, నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ మొదలైన ఇతర ఆశావహులను ఏం చెయ్యమంటారని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story