No-confidence : నేడే లోక్‌సభలో అవిశ్వాసం..

No-confidence : నేడే లోక్‌సభలో అవిశ్వాసం..
ప్రవేశపెట్టి ప్రసంగించనున్న రాహుల్

కేంద్రంపై ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నెటి నుంచి 3 రోజులు చర్చ జరగనుంది. ఈరోజు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఈ అంశంపై రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడనుండటం ఆసక్తి రేపుతోంది. లోక్ సభలో ఇవాళ అవిశ్వాస తీర్మానంపై చర్చ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై.. సాయంత్రం 7 గంటల వరకూ కొనసాగుతుంది. ఇలా 3 రోజుల తర్వాత.. ఆగస్టు 10న సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వం దీనికి సమాధానం ఇస్తుంది. మణిపూర్ అంశంపై ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టాలంటే అవిశ్వాస తీర్మానమే సరైనదనే ఏకాభిప్రాయానికి రావడంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రతిపక్షాలు ఇచ్చాయి. అందులో భాగంగా ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ జులై 26న అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత చర్చకు 3 రోజుల టైమ్ ఇచ్చింది లోక్‌సభ అడ్వైజరీ కమిటీ. ప్రతిపక్షాల సభ్యులు మాట్లాడాక.. ప్రధానీ మోదీ స్పందిస్తారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారన్నది చర్చనీయాంశం అయ్యింది.


మరోవైపు అనర్హత వేటు వల్ల లోక్ సభకు దూరంగా ఉన్న రాహుల్ 4 నెలల తర్వాత నిన్న లోక్‌సభకు రావడంకాంగ్రెస్ వర్గాలలోనూ, ప్రతిపక్షాల్లోను ఆనందం కనిపించింది. ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానాన్ని రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని కాంగ్రెస్ లోక్‌సభ చీఫ్ విప్ కె సురేష్ ఈరోజు మరోసారి ధృవీకరించారు. అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే.. NDA కూటమికి 272 ఓట్లు రావాలి. ఐతే.. బీజేపీకి సొంతంగా 301 ఓట్లు ఉన్నాయి. అందువల్ల అవిశ్వాస తీర్మానం అనవసరం అనే అభిప్రాయం ఉంది. ఎన్​డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు అని తెలిసినా సరే మోదీ మణిపూర్ ఘటనపై స్పందించాలన్నదే ఈ అవిశ్వాస ముఖ్య ఉద్దేశ్యం.

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్రం తరపున ఐదుగురు మంత్రులు మాట్లాడతారు. వీరిలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు ఉన్నారు. వీరితో పాటు మరో ఐదుగురు ఎంపీలు చర్చలో పాల్గొంటారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీ సభకు గైర్హాజరు కానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story