RAHUL: లద్ధాఖ్‌లో "రాహుల్‌ బైక్‌ రైడ్‌"

RAHUL: లద్ధాఖ్‌లో రాహుల్‌ బైక్‌ రైడ్‌
అదిరిపోయిన లుక్‌... నేడు పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలు

6) లద్దాఖ్‌ (Ladakh)లో పర్యటిస్తున్న కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)... పాంగాంగ్ సరస్సు(Pangong Lake) వరకు బైక్ రైడ్ (Bike Ride) చేశారు. నేడు ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను రాహుల్‌ ఇక్కడే నిర్వహించనున్నారు. బైక్‌ రైడ్‌కు సంబంధించిన దృశ్యాలను ఆయన తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.


KTM 390 బైక్‌ను కొనుగోలు చేశానని... భద్రతా కారణాల రీత్యా ఆ బైక్‌పై సెక్యూరిటీ బయటకు వెళ్లనీయడం లేదని రాహుల్ గాంధీ గతంలో ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆ బైక్‌పైనే ఆయన పాంగాంగ్ సరస్సు వరకు వెళ్లనున్నారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటని తన నాన్న చెప్పేవారని.. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నానంటూ రాహుల్‌ గుర్తు చేసుకున్నారు.


2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్‌ లద్దాఖ్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌ గురువారం లెహ్‌ (Leh)కు చేరుకున్నారు. లద్దాఖ్‌లో తన తొలి పర్యటన సందర్భంగా రాహుల్‌ లెహ్‌లో 500 మంది యువకులతో 40 నిమిషాల పాటు ముఖాముఖి నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story