Ram Mandir రామాలయ ప్రాంగణం నుంచి గర్భ గుడికి చేరిన రామ్ లల్లా విగ్రహం

Ram Mandir రామాలయ ప్రాంగణం నుంచి గర్భ గుడికి   చేరిన రామ్ లల్లా విగ్రహం
ఈ నెల 22 వరకు ప్రత్యేక క్రతువులు

అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా వివిధ క్రతువులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం అయోధ్య రాముడి గర్భగుడిలోకి శ్రీరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య ఆలయంలోకి జై శ్రీరాం నినాదాల మధ్య తరలించారు.

అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్‌లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్‌ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది. క్రేన్‌ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు. గురువారం ఆలయ గర్భగుడిలోకి విగ్రహాన్ని తెస్తారు. కాగా, వెండితో చేసిన ఒక రామ్‌ లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో బుధవారం ఊరేగించారు. పూజారి తలపై పై కలశాన్ని ఉంచుకుని ముందు నడుస్తుండగా, పూలతో అలంకరించిన పల్లకిలో ఈ వెండి విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు.అంతకుముందు ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలలో భాగంగా అయోధ్యలో కలశ పూజ ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌ సభ్యుడు అనిల్‌మిశ్రా దంపతులు సరయు నది ఒడ్డున దీనిని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. అనంతరం కలశాలలో సరయు నది నీటిని రామమందిరానికి తీసుకుని వెళ్లారు.ఆ తర్వాత కలశాలలో సరయు నది నీటిని రామాలయానికి తీసుకెళ్లారు. గర్భగుడిలో రామ విగ్రహం ప్రతిష్ఠించే చోట కూడా పూజలు చేశారు. ఈ క్రతువుల్లో సుమారు 121 మంది పురోహితులు పాల్గొంటున్నారు.


అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాన్ని గర్భగుడి సమీపానికి తీసుకొచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సభ్యులు, నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్...గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం వద్ద పూజలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ జరిగే 22 తేదీ వరకు క్రతువులు జరగనున్నాయి. అయోధ్యలోని కరసేవకపురాన్ని సందర్శించి జరుగుతున్న పనులను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్​ పర్యవేక్షించారు. ఓ వ్యానులో విగ్రహాన్ని తరలిస్తుండగా, అక్కడ ఉన్న ప్రజలందరూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు సూర్యకుండ్​ ప్రాంతంలో రాముడి చరిత్రతో లేజర్​ షో నిర్వహించారు.

ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి ఒంటి గంట వరకు బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి నిరాకరించారు. 23 నుంచి భక్తులకు రామ్‌లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని ట్రస్టు ప్రకటించింది. శ్రీరాముని వంశానికి చెందిన వారిగా చెప్పుకునే కొరియన్‌ రాణికి కూడా ఆహ్వానం పంపారు.

అమెరికా, బ్రిటన్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌, జర్మనీ, దక్షిణాఫ్రికా, ఫిన్‌లాండ్‌, హాంకాంగ్, కెనడా, ఇటలీ, ఐర్లాండ్‌, మెక్సికో, న్యూజిలాండ్‌ సహా మెుత్తం 55 దేశాలకు చెందిన ప్రతినిథులు హాజరుకానున్నారు. జనవరి 20న లక్నో చేరుకోనున్న విదేశీ అతిథులు...ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు అవుతారు

ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని పురస్కరించుకుని కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం అయోధ్య రామునికి సంప్రదాయ ఆచార విల్లు ‘ఓనవిల్లు’ను బహూకరించనుంది. ఈ నెల 18న అయోధ్యలో దీనిని ఆలయ నిర్వాహకులు అయోధ్య ట్రస్ట్‌కు అందజేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story