Ram Nath Kovind : జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

Ram Nath Kovind : జమిలి ఎన్నికలపై  కీలక వ్యాఖ్యలు
జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయన్న మాజీ రాష్ట్రపతి

జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాల కోసమే కానీఏ పార్టీ కోసమో కాదని మాజీ రాష్ట్రపతి, ఒకే దేశం-ఒకే ఎన్నిక కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్‌ చెప్పారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే ప్రజాధనం ఆదా అవుతుందన్నారు. అలా ఆదా అయిన మొత్తాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న కోవింద్ జాతీయ ప్రయోజనాల రీత్యా జమిలి ఎన్నికలకు సహకరించాలని అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ కమిటీ, నీతి ఆయోగ్‌, ఎన్నికల సంఘం సహా పలువురు ఒకే దేశం-ఒకే ఎన్నిక అవసరమని చెప్పారని కోవింద్‌ గుర్తుచేశారు. జమిలి కమిటీకి తనను కేంద్రంగా ఛైర్మన్‌గా నియమించిందన్న కోవిద్.ప్రజాభిప్రాయం సేకరించి ఈ ప్రక్రియను మళ్లీ ఎలా అమలు చేయాలో ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి వారి అభిప్రాయాలు కోరినట్లు వివరించారు. ఒకానొక దశలో అన్ని రాజకీయా పార్టీలు జమిలిని సమర్థించాయని చెప్పారు. జమిలి అమలుచేస్తేఅంతిమ లబ్దిదారు సామాన్యుడే అవుతాడని రామ్‌నాథ్ కోవింద్‌ చెప్పారు.

ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ జమిలి ఎన్నికల వల్ల ఎలక్షన్ నిర్వహణకు చేస్తున్న వ్యయం తగ్గుతుందని వెల్లడించారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు. ఈ తరహా ఎన్నికలతో దేశ ప్రజలందరికీ ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఒకే దేశం.. ఒకే ఎన్నికకు ఆయన మద్దతు తెలిపారు.

దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జమిలి ఎన్నికలకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను ఆయన కోరారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్ర ప్రభుత్వం రామ్‌నాథ్‌ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మంది నిపుణులతో అత్యున్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story