CABINET: కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు

CABINET: కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు
పీఎం విశ్వకర్మకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం... 169 నగరాల్లో 10 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు... 9 రాష్ట్రాలకు చెందిన 35 జిల్లాల్లో రైల్వే లైన్ల విస్తరణకు ఆమోదముద్ర...

స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi ) చేసిన కీలక ప్రకటనలకు కేంద్ర మంత్రిమండలి(Union Cabinet ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ‘ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ’ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్న ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి(PM Vishwakarma scheme ) కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. బీసీ కులవృత్తులకు అండగా ఉండడమే లక్ష్యంగా ప్రకటించిన విశ్వకర్మ పథకానికి 13 వేల కోట్లు(financial outlay of ₹ 13,000 crore) కేటాయించింది. విశ్వకర్మ పథకం(“Vishwakarma Yojana ) ద్వారా చేతివృత్తులవారికి 2 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. రోజుకు 500 రూపాయల ఉపకారవేతనంతో శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నట్లు తెలిపిన కేంద్రం శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు చేసేందుకు 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్‌ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద అర్హులైన వారికి ‘పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు అందజేస్తారు.


శిక్షణ తర్వాత 5శాతం వడ్డీతో లక్ష రూపాయల రుణం ఇవ్వనుంది. తొలివిడత రుణం సద్వినియోగం చేసుకుంటే అదనంగా మరో లక్ష రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 17న ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా 30లక్షల మంది(expected to benefit 30 lakh craftsmen families ) సంప్రదాయ చేతివృత్తి కళాకారులు, చేనేతలు, స్వర్ణకారులు, కుమ్మరి, కమ్మరి., రజకులు, నాయీ బ్రాహ్మణులు లబ్ధిపొందనున్నట్లు తెలిపింది. 32వేల 500 కోట్ల రూపాయల విలువైన ఏడు రైల్వే ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.


ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు చెందిన 35 జిల్లాల్లో రైల్వే లైన్ల విస్తరణకు ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం 2వేల 339 కిలోమీటర్ల మేర రైల్వే విస్తరణ పనులు చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్‌ సామర్థం పెంచడం,రైళ్ల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కీలక రైల్వే లైన్ల అభివృద్ధికి ఆమోదం లభించింది. 3వేల 238 కోట్లతో 239 కిలోమీటర్ల పొడవైన... గుంటూరు-బీబీనగర్ మార్గం డబ్లింగ్ కు..ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్-చెన్నై మధ్య 76 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఈ మార్గం ద్వారా హైదరాబాద్-విజయవాడ మధ్య కూడా తగ్గనుంది. ఈ నగరాల మధ్య ప్రయాణికుల రైళ్ల వేగం కూడా పెరగనుంది.


మరోవైపు పీఎం ఈ-బస్‌ సేవా పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 10 వేల ఈ-సిటీ బస్సులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో 169 నగరాల్లో ఈ-సిటీ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన కేంద్రం ఇందుకు 57వేల 613 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. డిజిటల్‌ ఇండియా పథకం కొనసాగింపునకు కేంద్ర కేబినెట్‌ 14వేల 903కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 5లక్షల 25వేల మంది ఐటీ ఉద్యోగుల నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు, 2లక్షల 65వేల మంది ఐటీ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు నిధులు వెచ్చించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story