PM MODI: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు

PM MODI: ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు
భారత్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో షాంఘై సహకార సంస్థ సదస్సు

ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను విమర్శించేందుకు షాంఘై సహకార సంస్థ ఎన్నడూ వెనకాడబోదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారత్ ఆతిథ్యంలో వర్చువల్ విధానంలో జరిగిన ఈ సదస్సు లో మాట్లాడిన మోదీ ఉగ్రవాదంపై ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ ఆపే విషయంలో అన్ని దేశాలు సహకరించాలన్నారు. ఇది మొత్తం ప్రపంచశాంతికి ముప్పని, కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని తమ విధానాల సాధన కోసం ఉపయోగించుకుంటున్నాయని, ఉగ్రవాదులకు, ఆశ్రయం కూడా ఇస్తున్నాయని ఆరోపించారు. అటువంటి దేశాలను విమర్శించడానికి SCO వెనుకాడదని పాకిస్తాన్ ప్రధాని షహాబాజ్ షరీఫ్ ముందే హెచ్చరించారు. ఉగ్రవాదం పై ఎవరూ ద్వంద్వ ప్రమాణాలతో ఉండకూడదని ఆయన సూచించారు.





ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ తదితర షాంఘై ప్రతినిధి దేశాల అధినేతలు హాజరయ్యారు. వారికి ప్రధాని మోడీ వర్చ్యువల్ గా ఆతిథ్యమిచ్చారు. భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, కజక్‌స్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల ప్రాతినిధ్యంతో కూడిన ఈ షాంఘై సహకార సంస్థ ఈ సారి గ్రూపులో కొత్త శాశ్వత సభ్యదేశంగా ఇరాన్‌కు స్వాగతం పలికింది.

రష్యా లో వాగ్నర్‌ గ్రూప్‌ స్వల్పకాలిక సాయుధ తిరుగుబాటు తరువాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి ఈ పాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంన్నారు. ఈ సందర్భంగా ఆయన రెచ్చగొట్టే పనులు చేసే వాళ్లకు వ్యతిరేకంగా రష్యా ఎప్పుడు పని చేస్తూనే ఉంటుందన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ఉన్న పాకిస్తాన్ కూడా ఈ సదస్సుకు హాజరైంది.

గత ఏడాది సెప్టెంబర్ 16న సమర్‌ఖండ్‌లో షాంఘై సదస్సు జరిగింది. రొటేషన్ పద్ధతితో సదస్సు నిర్వహణ బాధ్యత ఈసారి భారత్‌కు లభించింది.

దేశాల మధ్య అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని పెంపొందించడంపై ఈ సమావేశంలో కూ చర్చించినట్టు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story