Maharashtra : కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 27 మంది మృతులు

Maharashtra : కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 27 మంది మృతులు
ఇంకా కనపడని 78 మంది

మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నాలుగో రోజూ సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు ఇప్పటికీ 27 మంది మృత దేహాలు గుర్తించారు. గల్లంతైన 81మంది కోసం శిథిలాలను తొలిగిస్తూ అణువణువూ వెతికారు. ఇంకా ఫలితం లేకపోవడం తో ఆదివారం రాత్రి తో సహాయక చర్యల్ని ఆపివేశారు . దీంతో మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన విషాద ఘటనలో మృతుల సంఖ్య 27 గానే మిగిలిపోయంది. రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండ ప్రాంతమైన ఇర్షల్‌వాడీలో బుధవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో విషాదం నెలకొంది.ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించగా.. పదుల సంఖ్యలో ప్రజలు ఏమయ్యారో ఇప్పటివరకు తెలియరాలేదు. గల్లంతైన వారి కోసం వరుసగా నాలుగో రోజూ NDRF , ఇతర సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి శనివారం రాత్రి అయిపోవడం, వెలుతురు సరిగ్గా లేకపోవడం, వాతావరణ ప్రతికూలతల వల్ల అధికారులు సహాయక చర్యల్ని నిలిపివేసిన. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మళ్లీ గాలింపు ముమ్మరం చేశారు.

అయితే, ఇప్పటివరకు ఎవరినీ గుర్తించలేదని పేర్కొన్నారు. కొండచరియల కారణంగా కూలిన ఇళ్ల శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉంటే.. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువేనని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇర్షల్‌వాడీ గ్రామంలో మొత్తం 48 ఇళ్లు ఉండగా 17 ఇళ్లు కొండచరియల కారణంగా ధ్వంసమయ్యాయి. గ్రామంలో మొత్తం 229మంది జనాభా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 27 మంది మృతిచెందగా..10 గాయపడ్డారు. 111 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. ఇంకా కొంతమంది ప్రజల ఆచూకీ తెలియలేదు. ఘటన సమయంలో వీరిలో కొంతమంది.. గ్రామంలో లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండచరియల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో స్పష్టత లేదు. ప్రస్తుతం ఘటనాస్థలంలో శిధిలాలలో ఉన్న శరీరాలు కుళ్లిపోయి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉండటంతో రెస్క్యూ సిబ్బంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాలుగు రోజులు గడిచింది కాబట్టి ఇంకా ఎవరూ బతికి ఉండే అవకాశాలు లేకపోవడంతో మృతదేహాలు ఆగమేఘాల మీద వెలికి తీసే పనిని పక్కన పెట్టారు. ఆ గ్రామంలోని వ్యక్తుల ఆధార్ కార్డులు, ఇతర ప్రభుత్వ పత్రాలను ఆధారంగా చేసుకుని ఎవరెవరు కనపడకుండా పోయారు అన్న విషయంతో పాటు, వారికి కలిగిన నష్టాన్ని అంచనా వేసి ఇళ్లను ఇతర సదుపాయాలను కల్పిస్తామని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story