PM Modi: తేజ‌స్ యుద్ధ విమానంలో ప్ర‌ధాని మోదీ

మన స్వదేశీ సామర్థ్యంపై నమ్మకం మరింత పెరిగిందని వ్యాఖ్య

ప్రధాని మోదీ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యద్ధ విమానంలో విహరించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)ను ఈరోజు ప్రధాని సందర్శించారు. అక్కడ కొనసాగుతున్న కార్యకలాపాలను, తయారీ యూనిట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ట్విన్ సీటర్ తేజస్ లో ప్రయాణించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ... తేజస్ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించానని చెప్పారు. ఇదొక గొప్ప అనుభవమని అన్నారు. మన స్వదేశీ సామర్థ్యంపై తన నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. మన శక్తి సామర్థ్యాల పట్ల గర్వంగా ఉందని, ప్రపంచంలో మనం ఎవరికీ తక్కువ కాదనే విషయాన్ని గర్వంగా చెప్పగలనని తెలిపారు.

హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ‌.. తేజ‌స్ యుద్ధ విమానాల‌ను త‌యారు చేస్తోంది . లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉంది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థ‌తో హిందుస్థాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న‌ది. తేజ‌స్ విమానాల‌కు చెందిన‌ మాక్‌-3 ఇంజిన్ల‌ను హెచ్ఏఎల్ ఉత్ప‌త్తి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story